అఫీషియల్: కోవిడ్ తర్వాత ఫస్ట్ 1 మిలియన్ ఫిల్మ్ గా రికార్డ్ సాధించిన ‘జాతిరత్నాలు’

నవీన్ పొలిశెట్టి హీరోగా అనుదీప్ దర్శకత్వంలో, మహా నటి దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ నిర్మాణంలో వచ్చిన జాతి రత్నాలు సూపర్ హిట్ టాక్ ను దక్కించుకోవడంతో పాటు బాక్స్ ఆఫీస్ వద్ద డబుల్ ప్రాఫిట్స్ తో దూసుకుపోతోంది. మొదటి నాలుగు రోజుల్లోనే ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయిన ఈ సినిమా మొదటి 13 రోజుల్లో ఆంధ్ర – తెలంగాణాలో 30 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది. వరల్డ్ వైడ్ గా ‘జాతిరత్నాలు’ 11.5 కోట్ల మార్క్ ని టచ్ చేస్తే లాభాలు సాధించినట్టే అనుకున్న ఈ సినిమాకి ప్రతి ఏరియాలోనూ డబుల్ ప్రాఫిట్స్ వచ్చాయి.

ఇదిలా ఉంటే, సంక్రాంతి నుంచే తెలుగు రాష్ట్రాలలో మూవీ మార్కెట్ గాడిలో పడింది. కానీ యుఎస్ మార్కెట్ మాత్రం ఇంకా సెట్ కాలేదని చెప్పాలి. కోవిడ్ తర్వాత వచ్చిన సినిమాలేవీ యుఎస్ లో ఆశించిన స్థాయి బ్రేక్ ఈవెన్ మార్క్ ని కూడా క్రాస్ చేయలేదు. కానీ మొదటి సారి ఓవర్సీస్ లో సత్తా చాటుకున్న సినిమాగా ‘జాతి రత్నాలు’ రికార్డ్ నెలకొల్పింది. పెద్ద హీరోల సినిమాలకే యుఎస్ లో మార్కెట్ జరగని ఈ టైంలో జాతి రత్నాలు మూవీ 1 మిలియన్ మార్క్ ని టచ్ చేసి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.

యుఎస్ ట్రేడ్ వర్గాలు చెప్పిన దాని ప్రకారం 14వ రోజు ప్రీ బుకింగ్ సేల్స్ తో ఈ సినిమా 1 మిలియన్ మార్క్ ని టచ్ చేసిందని సమాచారం. దీంతో కోవిడ్ తర్వాత ఏ సినిమా సాధించని ఈ రికార్డ్ ని తెలుగు సినిమా జాతి రత్నాలు సాధించడంతో, తెలుగు సినిమాలకి మళ్ళీ ఓవర్సీస్ లో మళ్ళీ తెలుగు సినిమాలకి పూర్వ వైభవం వస్తుందని అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


Recent Random Post: