తెలుగు తమిళం కన్నడ హిందీ మలయాళం.. ఇలా దేశంలోని అన్ని భాషల్లో బంపర్ హిట్ అయిన బిగ్ బాస్ నిజానికి మన దేశంలో మొదలు కాలేదు. విదేశాల్లో మొదలైన ఈ రియాలిటీ షో అక్కడ గ్రాండ్ హిట్ అయ్యి మన దేశంలోకి వచ్చింది. హలాండ్ కు చెందిన ఒక వ్యక్తి ఐడియా ఆయన జీవితాన్నే మార్చేసింది.ఎంటర్ టైన్ మెంట్ ను పతాక స్థాయికి తీసుకెళ్లింది. బుల్లితెరపై సంచలన హిట్ అయ్యింది.
‘బిగ్ బాస్ ‘ ఐడియాకు బిజినెస్ రూపం ఇచ్చి అమలు పరిచిన వ్యక్తి ఇప్పుడు వందల కోట్లకు అధిపతి అయ్యాడంటే అతిశయోక్తి కాదు. ఈ ఐడియా ఆధారంగా రూపొందిన గేమ్ షోను వందల కోట్ల మంది కళ్లప్పగించి చూస్తున్నారు. అంతమందిని తన ఐడియా చుట్టూ తిప్పుకున్న ఆ బిగ్ బాస్ రూపకర్త ఆ బిగ్ బ్రదర్ ఎవరో కాదు.. ‘జాన్ డే మోల్’. సక్సెస్ ఫుల్ అయిన ఆయన ఐడియానే ఇప్పుడు బిగ్ బాస్ షోగా మనముందు ఉంది. ఆ విజయానికి కారణాలేంటో తెలుసుకుందాం..
కొత్తదనం అనేది వ్యాపార విజయ సూత్రాల్లో ప్రధానమైనదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటివరకు ఉన్న ట్రెండ్ కు భిన్నంగా వెళ్లగలిగే వారే అతి తక్కువ కాలంలో అత్యంత భారీ విజయాలు సాధిస్తారనడానికి మరో ఉదాహరణ జాన్ డే మోల్.
ఇన్నాళ్లు సినిమా టీవీ సీరియళ్ల వరకు వినోదం అంతా స్క్రిప్ట్ ప్రకారం ఉంటుంది. నటీనటులకు ముందే ఎలా నటించారో కెమెరా ముందే చెప్పి చేసుకుంటారు. కానీ ఇందుకు విరుద్ధంగా స్క్రిప్ట్ లేకుండా వినోద కార్యక్రమాన్ని రియలిస్టిక్ గా చూపితే ఎలా ఉంటుందనే కొత్త రకం ఐడియాకు పురుడు పోసి భారీ విజయం సాధించాడు జాన్ డే మూల్.
నెదర్లాండ్ వంటి చిన్న దేశంలో ప్రారంభమైన బిగ్ బ్రదర్ రియాల్టీ షో ఇప్పుడు బిగ్ బాస్ గా మారి ప్రపంచదేశాలను చుట్టేస్తోంది. బిజినెస్ లో సునిశిత పరిశీలన ఉండాలి. అంది మెండుగా ఉన్న వారిలో జాన్ డే మూల్ ఒకరు. ఒకరోజు ఆఫీసులో ఓ ఉద్యోగి అమెరికా చేపట్టిన బయో స్పియర్ సైంటిఫిక్ రిసెర్చ్ గురించి జాన్ కు చెప్పాడు. ఓ గాజు గ్లాసులో మనుషులను ఉంచి వారి మనుగడ ఎలా సాధిస్తారన్నది టాపిక్. ఐడియా చిన్నదే అయినా జాన్ కు బాగా కనెక్ట్ అయ్యింది.
మొదట సీజన్ బిగ్ బ్రదర్ ను జాన్ ప్రసారం చేసినప్పుడు అందరూ నిరాశపరిచారు. ఒక్క ప్రకటన రాలేదు. అయినా ధైర్యంతో ప్రసారం చేశాడు. నాలుగు వారాలు గడిచాక జనాలకు బాగా ఎక్కింది. ఆ తర్వాత జాన్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రస్తుతం తెలుగులోనూ బిగ్ బాస్ నడుస్తోందంటే అదంతా జాన్ మెదడులో పెట్టిన అప్పటి ఆలోచనే కావడం గమనార్హం. ఇప్పుడు జాన్ రెండు బిలియన్ డాలర్ల ఆస్తులతో ఏకంగా ఫోర్బ్స్ జాబితాలో చాటు సంపాదించాడు.
Recent Random Post: