ఫోటో స్టోరి: వీరత్వానికి ప్రతీక కొమురం భీమ్

ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో అల్లూరిగా చరణ్ నటిస్తుంటే తెలంగాణ ప్రాంతానికి చెందిన గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో తారక్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ రెండు లుక్ లను టీమ్ విడుదల చేసింది. ఇక కొమురం భీమ్ గెటప్ లో తారక్ లుక్ వంద శాతం యాప్ట్ గా కుదిరిందన్న ప్రశంసలు కురుస్తున్నాయి. తలపాగా .. పంచె కట్టు.. కాటన్ దుస్తులు.. మెడలో పులి గోర్లు.. తోలు దస్త్రం.. చేతిలో తీగలు చుట్టిన ధృఢమైన వెదురు కర్ర.. వెనక వైపుగా తగిలించుకున్న తుపాకీ.. ఈ వేషధారణకు తారక్ పర్ఫెక్ట్ గా కుదిరారు. వీరత్వం అతడి ఆహార్యంలో ఉట్టి పడుతోంది.

కొమురం భీమ్ ప్రస్థానం…

కొమురం భీమ్ (1901 అక్టోబరు 22 – 1940 అక్టోబరు 27) హైదరాబాదు విముక్తి కోసం అసఫ్ జహి రాజవాసానికి వ్యతిరేకంగా పోరాడిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నాయకుడు. ఆదిలాబాద్ అడవులలో గోండు ఆదివాసుల కుటుంబంలో అతడు జన్మించారు. గిరిజన గోండు తెగకు చెందిన కొమరం చిన్నూ- సోంబారు దంపతులకు ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ తాలూకాలోని సంకేపల్లి గ్రామంలో 1901 సంవత్సరంలో జన్మించాడు. పదిహేనేళ్ల వయసులో అటవీశాఖ సిబ్బంది జరిపిన దాడిలో తండ్రి మరణించగా.. కొమరం కుటుంబం కరిమెర ప్రాంతంలోని సర్ధాపూర్ కు వలస వెళ్లింది. కొమరం భీమ్ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా శైలిలో పోరాడాడు. ఇతను అడవిని జీవనోపాధిగా చేసుకొని అన్ని రకాల నిజాం అధికారాలను (అనగా న్యాయస్థానాలు- చట్టాలు) తోసిపుచ్చాడు. అతను నిజాం నవాబ్ సైనికులకు వ్యతిరేకంగా ఆయుధాలు తీసుకున్నాడు. పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా ఉద్యమించి వీరమరణం పొందాడు.

ఉద్యమ జీవితం
భారతదేశంలో ఆదివాసీల హక్కుల కోసం జరిగిన పోరాటాలు చరిత్రాత్మక మైనవి. ఆదివాసీలపై నిజాం నవాబు సాగించిన దోపిడీ- దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన కొమురం భీమ్ `జల్-జంగిల్-జమీన్` నినాదానికి ప్రతీకగా నిలిచిపోయూడు. కొండ కోనల్లోప్రకృతితో సహ జీవనం సాగించే ఆదివాసీ ప్రజలకు అడవిపై హక్కు సామాజిక న్యాయంలో భాగమని నినదిస్తూ 1928 నుంచి 1940 వరకూ రణభేరి మోగించిన కొమరం భీమ్ నైజాం సర్కార్ గుండెల్లో సింహ స్వప్నంగా మారిన పోరాటయోధుడిగా నిలిచాడు.

భీం కుటుంబం పదిహేడేళ్ళ వయసులో అటవీశాఖ సిబ్బంది జరిపిన దాడిలో తండ్రి మరణించగా కరిమెర ప్రాంతంలోని సర్దాపూర్ కు వలస వెళ్లింది. అక్కడ వాళ్ళు సాగుచేసుకుంటున్న భూమిని సిద్దిఖీ అన్న జమీందారు ఆక్రమించుకోవడంతో ఆవేశం పట్టలేని భీమ్ అతన్ని హతమార్చి అస్సాం వెళ్ళిపోయాడు. అక్కడ ఐదేళ్ళపాటు కాఫీ- తేయాకు తోటల్లో పనిచేస్తూ గడిపిన భీమ్ తిరిగి కరిమెర చేరుకున్నాడు. నిజాం నవాబు పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా గిరిజనులను ఒక్కతాటిపై నడిపించి ఉద్యమించాడు. ఆసిఫాబాద్ పరిసర ప్రాంతాలు.. జోడేఘాట్ గుట్టలు కేంద్రంగా నిజాం నవాబు పై గెరిల్లా పోరాటాన్ని కొనసాగించాడు. భీమ్ కు కుడిభజంగా కొమురం సూరు కూడా ఉద్యమంలో పాల్గొన్నాడు.వెడ్మ రాము కూడా భీమ్ కు సహచరుడిగా ఉన్నాడు. కుర్దు పటేల్ అనే నమ్మకద్రోహి ఇచ్చిన సమాచారంతో నిజాం సైన్యం 1940 అక్టోబర్ 27 న జోడేఘాట్ అడవుల్లోని కొమురం భీమ్ స్థావరాన్ని ముట్టడించి భీమ్ ని హతమార్చాయి.

నిజాం సైన్యంమీద అటవీ సిబ్బంది పైనా కొమరం కొదమసింహం లా గర్జించాడు. కుర్దు పటేల్ అనే నమ్మకద్రోహి ఇచ్చిన సమాచారంతో అర్ధరాత్రి కొమరం స్థావరాలను సైన్యం చుట్టుముట్టగా జోడేఘాట్ అడవుల్లో 1940 అక్టోబర్ 27 న అంటే ఆదివాసీలు పవిత్రంగా భావించే ఆశ్వీయుజ శుద్ధ పౌర్ణమి రోజున కొమరం భీమ్ వీరమరణం పొందాడు. అప్పటి నుంచీ ఆ తిథి రోజునే కొమరం భీమ్ వర్ధంతి జరుపుకోవడం ఆదివాసీల ఆనవాయితీ. ఆదిలాబాద్ జిల్లా కుంతాల జలపాతం వద్ద కొమురం భీము విగ్రహాన్ని ఏర్పాటు చేసారు.

కొమురం భీం శిలావిగ్రహం
ఆదివాసీ ఆత్మగౌరవ ప్రతీక కొమురం భీమ్. స్వయంపాలన- అస్తిత్వ ఉద్యమాల వేగుచుక్క భీం. పోరాట పంథానే చివరకు సరైన మార్గమని తన జాతి ప్రజలను విముక్తి చేస్తుందని అక్షరాలా నమ్మిన ఆదివాసీ పోరాట యోధుడు. ఆదిలాబాద్ అడవుల్లో భీం పోరాటం జరిగి నేటికి డభ్భై రెండు ఏళ్లు పూర్తి కావస్తున్నది. ఇప్పుడు ఒక ప్రత్యేక సందర్భంలో భీం వర్ధంతిని ఆదివాసీ సమాజాలు జరుపుకుంటున్నాయి. స్వయంపాలన కోసం తెలంగాణ ప్రజలు అలుపు ఎరగకుండా ఉద్యమిస్తున్న సందర్భం నేడు ఉంది. స్వయంపాలన కోసం ఉద్యమిస్తున్న ఆదివాసీ సమాజాలను క్రూరంగా అణచివేస్తున్న ప్రభుత్వాలు కళ్లముందు కనబడుతున్నాయి. దేశంలో తమ హక్కుల సాధన కోసం ఆదివాసీ సమాజాలు ఉద్యమించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. బ్రిటిష్ చట్టాలకు వ్యతిరేకంగా బిర్సాముండా- సంతాల్ లు తిరుగుబాటు చేశారు. జల్- జంగల్- జమీన్ కోసం సాయుధ పోరాటాలు చేశారు. తమపై సాగుతున్న అన్నిరకాల దోపిడీ పీడనలను ఎదిరించారు. చరివూతలో అనేకసార్లు ఓటమి చెందినా తమ జీవితమే యుద్ధమైన చోట తమ అస్తిత్వం కోసం అలుపెరుగని పోరాటాలు నేటికీ చేస్తున్నారు.

ఆదివాసీ భూరక్షణ చట్టం 1/70 చట్టాన్ని అమలుపర్చడంలేదు. అన్యాక్షికాంతమవుతున్న అడవులను- భూములను పట్టించుకోదు. గోండు తెగకు సంబంధించిన ప్రధాన్- తోటి- మన్నె-కోయ తెగలే కాకుండా నాయక్ పోడ్- ఆంధ్ ఇతర ఆదివాసీ తెగలు ఆదిలాబాద్ లో నివసిస్తున్నాయి. ఇప్పుడు వీరి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. 1975కు పూర్వం వలస బంజారాల జనాభా కేవలం పది వేలనని హైమన్ డార్ఫ్ స్పష్టం చేశారు. ఇప్పుడు వీరి జనాభా పదింతలపైన ఉంది. వలస వచ్చిన వాళ్ళు ప్రజాప్రతినిధులవడంతో వీరికష్టాలు రెట్టింపయ్యాయి. ఆదిమ సమాజం వీరి వల్ల రక్షణలను కోల్పోతున్నది. ఇలాంటి పరిస్థితిలో ఆదివాసీల మనుగడ కష్టమేనని ఆదివాసీ నాయకులు మదనపడుతున్నారు. ఆదివాసీల రక్షణ ప్రభుత్వానిదే అయినప్పుడు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్న ప్రభుత్వాల వైఖరిలో మార్పు రావడంలేదు.

అస్తిత్వ ఉద్యమాలు కొనసాగుతున్న నేటి తరుణంలో 1940లోనే ఆత్మగౌరవం స్వపరిపాలన పునాదులుగా కొమురం భీం సాయుధ తిరుగుబాటు చేశాడు. అతని ముందు చూపు వివిధ ఉద్యమాలకు ప్రేరణగా నిలుస్తున్నది. బాబేఝురి లోద్దుల్లో పన్నెండు గూడేలపై రాజ్యాధికారం కోసం తుడుం మోగించిన కొమురం భీం వారసత్వం నేటికీ దండకారణ్యంలో కొనసాగుతున్నది.


Recent Random Post: