ఈఎంకే కు ఎన్టీఆర్‌ పారితోషికం? గతంలో నాగ్ చిరులు ఎంత తీసుకున్నారంటే..!

తెలుగు బుల్లి తెర ప్రేక్షకుల ముందుకు మళ్లీ కౌన్ బనేగా కరోడ్‌ పతి తెలుగు వర్షన్‌ రాబోతుంది. మీలో ఎవరు కోటీశ్వరులు పేరుతో నాలుగు సీజన్‌ లను స్టార్‌ మా ప్రసారం చేసింది. నాగార్జున మరియు చిరంజీవిలు హోస్టింగ్‌ చేశారు. స్టార్‌ మాకు ఆశించిన స్థాయిలో టీఆర్పీ రేటింగ్‌ మరియు బిజినెస్ రాకపోవడంతో నష్టాల వల్ల వదిలేసినట్లుగా చెబుతున్నారు. నాగార్జునకు దాదాపుగా 4.5 కోట్ల రూపాయల పారితోషికంను సీజన్‌ కు ఇచ్చారు. చిరంజీవికి ఆయన మెగా క్రేజ్‌ కారణంగా రూ.9 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎన్టీఆర్‌ తో జెమిని టీవీ వారు అదే షోను ఎవరు మీలో కోటీశ్వరులు అనే పేరుతో చేస్తున్నారు.

ఇటీవలే ఈ షో ప్రెస్ మీట్ జరిగింది. ఎన్టీఆర్ ఈ షో తో రెచ్చి పోవడం ఖాయం అనిపిస్తుంది. గతంలో ఎన్టీఆర్‌ బిగ్ బాస్ కు గాను నాలుగు కోట్ల రూపాయలను పారితోషికంగా తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇక ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమం కోసం ఎన్టీఆర్‌ రూ.7.5 కోట్ల ను పారితోషికంగా తీసుకోబోతున్నాడు. 60 ఎపిసోడ్‌లుగా ఈ సీజన్ ను ప్లాన్‌ చేశారు. దాదాపుగా 90 మందితో ఎన్టీఆర్‌ ఇంటరాక్ట్‌ అవ్వబోతున్నాడట. మొత్తానికి ఈ షో తెలుగు బుల్లి తెర చరిత్రలో ఒక చరిత్ర సృష్టిస్తుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.


Recent Random Post: