ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమాను చేయబోతున్నాడు. అతి త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతున్నాయి. ఎన్టీఆర్31 సినిమా కూడా ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా జాన్వీ కపూర్ ను నటింపజేసేందుకు మైత్రి మూవీ మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. మైత్రి మూవీ మేకర్స్ బోనీ కపూర్ ద్వారా జాన్వీ కపూర్ ను ఈ సినిమాలో నటించాల్సిందిగా కోరారని కూడా వార్తలు వచ్చాయి.
ముంబయి మీడియా వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం జాన్వీ కపూర్ ఒక తెలుగు సినిమాకు ఓకే చెప్పిందని అంటున్నారు. జాన్వీ కపూర్ చేయబోతున్న ఆ మొదటి తెలుగు సినిమా ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ కాంబో మూవీ అయ్యి ఉంటుందనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల ఆమె వద్దకు వెళ్లిన తెలుగు మేకర్స్ మైత్రి మూవీ వారు తప్ప మరెవ్వరు లేరట. అందుకే ఆమె ఓకే చెప్పింది మైత్రి వారి ఆఫర్ కే అయ్యి ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
శ్రీదేవి కూతురుగా హిందీ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకునేందుకు కెరీర్ ఆరంభంలోనే లేడీ ఓరియంటెడ్ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తుంది. హిందీతో పాటు ఇదే సమయంలో తెలుగులో కూడా ఈమె నటించేందుకు ఓకే చెప్పిన నేపథ్యంలో ముందు ముందు మరిన్ని సినిమాలను ఈమె తెలుగులో చేసే అవకాశం ఉందని మీడియా సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ కాంబో పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. కనుక ఇలాంటి సినిమా చేయడం వల్ల ఖచ్చితంగా జాన్వీ కపూర్ కెరీర్ గాడిన పడ్డట్లు అవుతుందని కూడా అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Recent Random Post: