టాలీవుడ్ మోస్ట్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారినట్లు తెలుస్తోంది. ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో రెండు రోజులుగా ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. తాజాగా వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం ఆయన ఇంకా వెంటిలేటర్ పైనే ఉన్నారని అయితే బీపీ లెవల్స్ తక్కువగానే ఉన్నాయని తెలిపారు. దీంతో ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే సీనియర్ నటుడైన కైకాల సత్యనారాయణ చివరగా మహేశ్ బాబు హీరోగా వచ్చిన ‘మహర్షి’ సినిమాలో కనిపించారు.
తెలుగు సినీ ఇండస్ట్రీలో దాదాపు మూడు తరాల వారికి పరిచయ నటుడిగా ఉన్న సత్యనారాయణ కు విలక్షన నటుడిగా పేరుంది. విలన్ గా ప్రస్థానమైన ఆయన సినీ జీవితం క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడింది. వందల కొద్దీ సినిమాల్లో నటించిన ఆయన పాత్ర ప్రత్యేకంగా ఉంటుంది. ఓ వైపు కమెడియన్ గా.. మరోవైపు విలన్ గా.. సత్యనారాయణ తన నటనతో మెప్పించారు. తోటి నటులతో ఎంతో సౌమ్యంగా ఉండే కైకాల నాటి ఎన్టీఆర్ తో నటనపరంగా పోటీపడేవారు.
కైకాల పుట్టిన రోజు సందర్భంగా ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అప్పటి వరకు యాక్టివ్ గా ఉన్న సత్యనారాయణ కొద్ది రోజుల కిందట ఆయన ఇంట్లో జారి పడ్డారు. దీంతో సికింద్రాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. ఆ తరువాత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు హెల్త్ బులిటెన్ ప్రకటిస్తున్నారు.
దాదాపు 777 సినిమాల్లో నటించిన కైకాల సత్యనారాయణకు ఓ కుమారుడు కూడా ఉన్నారు. ఆయన సినీ ఇండస్ట్రీలోనే నిర్మాతగా పనిచేస్తున్నారు. ‘కేజీఎఫ్’ మొదటి సినిమా నిర్మాతల్లో సత్యానారాయణ కుమారుడు ఒకరు. 60 ఏళ్లుగా సినీ పరిశ్రమతో అనుబంధం ఉన్న ఆయన ఏ పాత్ర అయినా చేయడానికికి వెనుకాడలేదు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి పై సినీ ఇండస్ట్రీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
Recent Random Post: