ప్రియుడితో స్క్రీన్ షేరింగ్ ఎక్స్ పీరియన్స్

బాలీవుడ్ లో ధోని సినిమాతో మంచి గుర్తింపును దక్కించుకున్న ముద్దుగుమ్మ కియారా అద్వానీ ఆ తర్వాత బాలీవుడ్ అర్జున్ రెడ్డి ‘కబీర్ సింగ్’ తో స్టార్ గా మారిపోయింది. బాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లో కియారా అద్వానీ చేరింది అనడంలో సందేహం లేదు. భారీగా పారితోషికం తీసుకుంటూ బిజీగా ఉన్న కియారా అద్వానీ తాజాగా ‘షేర్షా’ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా లో ప్రియుడు సిద్దార్థ్ మల్హోత్ర కు జోడీగా నటించింది. రియల్ లైఫ్ ప్రియుడితో రీల్ లో ప్రేయసిగా నటించడం చాలా కొత్తగా ఉంటుంది. ఇద్దరి మద్య సన్నివేశాలు చాలా ఇంట్రెస్టింగ్ గా వస్తాయి. ఇద్దరి మద్య ప్రేమ వ్యవహారం చాలా కాలంగా నడుస్తుంది. వీరి ప్రేమ విషయం అందరికి తెలిసిన బహిరంగ రహస్యం.

షేర్షా లో ప్రాణాలను సైతం లెక్క పెట్టకుండా పోరాటం చేసే జవాన్ పాత్రలో రియల్ హీరోగా సిదార్థ్ మల్హోత్ర కనిపించాడు. భారీ అంచనాలున్న ఈ సినిమా షూటింగ్ సమయంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. సిద్దార్థ్ మరియు కియారా అద్వానీ కలిసి నటించడం వల్ల మొదటి నుండి అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా విడుదల తర్వాత కూడా పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది. రియల్ లవర్స్ ను రీల్ పై చూస్తుంటే బాగుంది అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకోవడంతో పాటు దేశ భక్తిని పెంపొందించే విధంగా సినిమా ఉంది. జనాల కోసం ఆర్మీ జవాన్ లు ఎంతగా కష్టపడుతున్నారో సినిమాలో చూపించారు.

షేర్షా లో తన పాత్ర గురించి కియారా అద్వానీ మాట్లాడుతూ.. నేను పోషించిన డింపుల్ పాత్ర ఎప్పటికి గుర్తుండి పోతుంది. సినిమా రిలీజ్ తర్వాత నాకు మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. సోషల్ మీడియాలో నా పాత్ర గురించి వచ్చిన ప్రశంసలకు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. దేశం కోసం ప్రాణాలను లెక్క పెట్టని ఒక సైనికుడికి ప్రేయసిగా నటించడం చాలా సంతోషం. నా యాక్టింగ్ చాలా ఎమోషనల్ గా ఉంది. నటనకు మరియు పాత్రకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇక సిద్దార్థ్ మల్హోత్ర తో నటించడం పై ఆమె స్పందిస్తూ.. మంచి నటుడితో నటిస్తే తప్పకుండా మంచి ఫీలింగ్ ఉంటుందని ఈ సందర్బంగా చెప్పుకొచ్చింది. తెలుగు లో ఈమె త్వరలో రామ్ చరణ్ మరియు శంకర్ కాంబోలో రూపొందబోతున్న సినిమాలో నటించబోతుంది. హిందీలో వరుసగా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు తెలుగు లో కూడా సినిమాలు చేసేందుకు సిద్దంగా ఉంది. భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్నా కూడా వరుసగా సినిమాలు ఆఫర్లను దక్కించుకుంటూ ఉంది.


Recent Random Post: