త్రిష తర్వాత కాజల్ కు ఆ అరుదైన గౌరవం

యూఏఈ 2019 సంవత్సరం నుండి గోల్డెన్ వీసా ను ఇవ్వడం మొదలు పెట్టింది. ఈ వీసా వివిధ దేశాలకు చెందిన ప్రముఖులకు ఆ దేశం ఇస్తుంది. యూఏఈ గోల్డెన్ వీసా ఉన్న వారు అక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఎలాంటి స్పాన్సర్ షిప్ లేకుండా అక్కడ వ్యాపారాలు చేసుకోవడంతో పాటు ఇంకా పలు బెనిఫిట్స్ ను అందుకుంటారు. యూఏఈ గోల్డెన్ వీసాను మొదటగా ఇండియా నుండి బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ పొందాడు. ఆయన బాలీవుడ్ లో చేసిన సేవతో పాటు ఆయనకు యూఏఈ లో ఉన్న అభిమానుల కారణంగా అక్కడి ప్రభుత్వం గోల్డెన్ వీసాను ఇవ్వడం జరిగింది.

ఆ తర్వాత పలువురు సినీ ప్రముఖులకు ఆ వీసా దక్కింది. ఇటీవలే హీరోయిన్ త్రిష కు ఆ అరుదైన గౌరవం దక్కింది. ఇప్పుడు ఆ అరుదైన గౌరవం ను టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ దక్కించుకుంది. ఆ విషయాన్ని కాజల్ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేసి తన సంతోషాన్ని షేర్ చేసుకుంది.

యూఏఈ గోల్డెన్ వీసా ను అందుకుంటున్న ఫొటోను షేర్ చేయడంతో పాటు తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. యూఏఈ దేశం ఎప్పుడు కూడా మాలాంటి ఆర్టిస్టులను ప్రోత్సహించడంలో ముందు ఉంటుంది.

నేను తప్పకుండా ఈ అవకాశం ను సద్వినియోగం చేసుకుంటాను అన్నట్లుగా కాజల్ పేర్కొంది. తనకు ఈ అవకాశం రావడంకు దోహద పడ్డ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేసింది. కాజల్ అగర్వాల్ కు ముందు ఈ గోల్డెన్ వీసాను భారతీయ సెలబ్రెటీలు అయిన షారుఖ్ ఖాన్.. బోనీ కపూర్.. అర్జున్ కపూర్.. జాన్వీ కపూర్.. మోహన్ లాల్.. దుల్కర్ సల్మాన్.. త్రిష.. మమ్ముట్టి ఇంకా కొందరు దక్కించుకున్నారు. ముందు ముందు మరింత మందికి కూడా ఈ గోల్డెన్ వీసా యొక్క గౌరవంను యూఏఈ ప్రభుత్వం ఇవ్వాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇక కాజల్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె గర్బంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఇప్పటికే కమిట్ అయిన నాగార్జున.. ప్రవీణ్ సత్తారుల కాంబో మూవీ ఘోస్ట్ ను కూడా వదిలేయాల్సి వచ్చిందట. కాని ఈమె నటించిన ఆచార్య సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉంది.

కాజల్ డెలవరీ తర్వాత ఆరు నెలల గ్యాప్ తీసుకుని మళ్లీ షూటింగ్ లకు హాజరు అవుతానంటూ సన్నిహితులతో చెప్పుకొచ్చింది. పెళ్లి అయ్యి పిల్లలు అయిన తర్వాత ఇండస్ట్రీలో కొనసాగుతున్న వారు ఈ మద్య కాలంలో చాలా మంది ఉన్నారు. కనుక కాజల్ కూడా తప్పకుండా మంచి సినిమాలు చేస్తూ పిల్లల తర్వాత కూడా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడం ఖాయం అనిపిస్తుంది. కాజల్ ను ఇంకా కూడా టాలీవుడ్ ప్రేక్షకులు టాప్ హీరోయిన్ గానే ట్రీట్ చేస్తూ పిలుస్తూ ఉంటారు. కనుక ఆమె నుండి ఖచ్చితంగా మంచి సినిమాలు ముందు ముందు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.


Recent Random Post: