మెగాస్టార్ హీరోయిన్ ఇంట స్పెషల్ సెలబ్రేషన్స్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ `ఆచార్య`. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీలో అందాల చందమామ కాజల్ అగర్వాల్ .. మెగాస్టార్ చిరంజీవికి జోడీగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ టైమ్ లోనే పెళ్లి.. ఆ తరువాత ప్రెగ్నెంట్ అయిది. తన చిరకాల మిత్రుడు గౌతమ్ కిచ్లూని ప్రేమించి పెద్దల అంగీ కారంతో వివాహం చేసైఉకుంది కాజల్ అగర్వాల్. పెళ్లి తరువాత హనీమూన్ కోసం మాల్దీవ్ లకి వెళ్లి వార్తల్లో నిలిచింది. అక్కడ అండర్ వాటర్ లో వున్న ప్రత్యేక గదిలో భర్త కిచ్లూతో కలిసి హనీమూన్ ని ఎంజాయ్ చేసింది.

ఆ తరువాత తను ప్రెగ్నెంట్ అంటూ వార్తలు షికారు చేశాయి. ఆ వార్తల్ని నిజమే అంటూ భర్త గౌతమ్ కిచ్లూతో కలిసి కాజల్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తెలుగు తమిళ భాషల్లో దాదాపు 16 ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా వన్నె తరగని చరిష్మాతో ఆకట్టుకుంటున్న కాజల్ అగర్వాల్ పెళ్లి తరువాత కూడా తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తూ క్రేజీ ప్రాజెక్ట్ లని సొంతం చేసుకుంది. ఇదిలా వుంటే అందాల చందమామ గర్భవంతి కావడంతో ఆమెకు కుటుంబ సభ్యులు శ్రీమంతాన్ని నిర్వహించారు.

ఇరు కుటుంబాలకు చెందిన ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి కాజల్ అగర్వాల్ కు గ్రాండ్ గా శ్రీమంతం ఫంక్షన్ ని ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ సందర్బంగా రెడ్ కలర్ పట్టు సారీలో కాజల్ అగర్వాల్ మెరిసిపోయింది. గౌతమ్ కిచ్లూ కూడా తనదైన స్టైల్ డ్రెస్సింగ్ తో అదరగొట్టాడు. వైట్ అండ్ వైట్ కుర్తా ధరించిన గౌతమ్ కిచ్లూ దానిపై రెడ్ కలర్ జాకెట్ వేసుకుని కాజల్ డ్రెస్ తో మ్యాచ్ అయ్యేలా రెడీ అయిపోయాడు.

ఈ సందర్భంగా కాజల్ గౌతమ్ కలిసి ఫొటోలకు ప్రత్యేకంగా పోజులిచ్చారు. కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ తో కలిసి ఫొటోలు దిగిన కాజల్ గౌతమ్ కిచ్లూ ఆ ఫొటోలని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రెగ్నెన్సీ కారణంగా కాజల్ పలు చిత్రాలని వదులుకోవాల్సి వచ్చింది. కింగ్ నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు రూపొందిస్తున్న చిత్రం `ఘోస్ట్`. ఈ మూవీలో ముందు కాజల్ అగర్వాల్ నే హీరోయిన్ గా అనుకున్నారు.

కానీ ప్రెగ్నెన్సీ కారణంగా కాజల్ ఈ మూవీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే డెలివరీ తరువాత అంటే ఓ ఏడాది తరువాత మళ్లీ సినిమాల్లో కాలజ్ బిజీ కానుందని ఎప్పటి లాగే తను సినిమాల్లో నటిస్తుందని ఆమె సన్నిహితులు అంటున్నారట. కల్యాణ్ రామ్ `లక్ష్మీ కల్యాణం` సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కాజల్ `చందమామ` సినిమాతో పాపులారిటీని సొంతం చేసుకుంది.


Recent Random Post: