చందమామను మరిచితిరా? లైట్ తీస్కున్నారా?

కొన్ని సందర్భాల్లో వేదికలపై పేరు మర్చిపోతే దానికి మీడియా రంధ్రాన్వేషణ చేయడం సహజం. నిజానికి దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళిని ముఖ్య అతిథిగా పిలిచిన ఆచార్య వేదికలో ఇలాంటి పొరపాటే ఒకటి జరిగింది.

వేదికపై అగ్రజులు అందరూ టెక్నీషియన్లతో పాటు ఇతర తారాగణాన్ని పొగిడేసినా కానీ కథానాయికగా నటించిన కాజల్ పేరు మార్చిపోయారు. మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్ – కొరటాల వంటి ప్రముఖులు కూడా కాజల్ పేరును మర్చిపోవడం ఆశ్చర్యపరిచింది. నిజానికి చిరు కానీ చరణ్ కానీ ఇలాంటివి అస్సలు మిస్ చేయరు.

కానీ ఈసారి ఎమోషనల్ ఘట్టంగా ఈ వేదిక మారడంతో అలా కాజల్ గురించి మరిచారని భావించాలి. ఈ వేదికపై దిల్లీలో తనకు జరిగిన అవమానం గురించి చిరు చెబుతూ ఎమోషనల్ అయ్యారు. తన స్పీచ్ ఆద్యంతం రాజమౌళి గురించి ప్రశంసలు ఎమోషన్ మాత్రమే కనిపించింది. కొరటాల గురించి చిరు అద్భుతంగా చెప్పారు. ఆచార్య బృందం షూటింగ్ ని సమయానికి పూర్తి చేయడంలో సహాయపడినందుకు రాజమౌళికి కృతజ్ఞతలు తెలిపారు. RRR – ఆచార్య నడుమ చెర్రీ తేదీలను సర్దుబాటు చేయడంలో రాజమౌళి సహకారాన్ని గుర్తు చేసుకున్నారు.

ఆశ్చర్యకరంగా తమ ప్రసంగాలలో కాజల్ అగర్వాల్ పేరును ఎవరూ ప్రస్తావించలేదు. ఆ సినిమా దర్శకుడు కొరటాల శివ కానీ పూజా హెగ్డే కానీ స్పీచ్ లో ప్రస్థావించి ఉంటే బావుండేది .. కానీ అది జరగలేదు. చిరుతో సినీనిర్మాణంలో నాకు ఎదురైన అనుభవాలను నిక్షిప్తం చేయబోతున్నాను అని కొరటాల శివ తెలిపారు.

కానీ కాజల్ ని మరిచారు. పూజ గురించి ప్రస్తావించినా కానీ కాజల్ గురించి మాట్లాడకపోవడం ఆశ్చర్యపరిచింది. చిరు కూడా పూజా హెగ్డే చిరునవ్వును మెచ్చుకున్నారు.. కానీ తన జోడీ కాజల్ గురించి మాత్రం చెప్పలేదు.
కాజల్ అగర్వాల్ మాత్రమే కాదు… సోనూసూద్ పేరు కూడా ఎవరూ ప్రస్తావించలేదు. మరోవైపు కాజల్ అగర్వాల్ ఫ్రెగ్నెంట్ అయినా కానీ ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసి అన్ని రకాలుగా సహకరించారు. ప్రస్తుతం తన బేబీ-భర్తతో ఆనంద సమయం గడుపుతున్నారు.

సినిమాకి 200-300 మంది పని చేస్తుంటారు. అయితే అందులో ఎన్ని పేర్లు గుర్తుంటాయో ఒక్కోసారి చెప్పలేం. ఒకవేళ యాధృచ్ఛికంగానే మర్చిపోతే దానికి సారీ కూడా చెప్పేస్తుంటారు పెద్ద స్టార్లు. మరి కాజల్ కి చిరు-చరణ్ – కొరటాల సారీ చెబుతారేమో..! అంటూ అభిమానులు చర్చిస్తున్నారు. ఈ చిత్రంలో సోను ప్రధాన ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఆచార్య ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో ఐదు రోజుల్లోనే రిజల్ట్ ఏమిటన్నది రిపోర్ట్ కూడా అందనుంది.


Recent Random Post: