అజిత్ సినిమా ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పిన కార్తికేయ

ఆరెక్స్ 100 తర్వాత టాలీవుడ్ లో ఫేమ్ సంపాదించుకున్న కార్తికేయ తర్వాత చేసిన సినిమాలు అన్నీ ఫెయిల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో బౌన్స్ బ్యాక్ చేయాలని చూస్తున్న కార్తికేయ చేసిన రీసెంట్ సినిమా చావు కబురు చల్లగా. ఈ సినిమా మార్చ్ 19న విడుదల కానుండడంతో కార్తికేయ వరస ప్రమోషనల్ కార్యక్రమాలలో పాల్గొంటున్నాడు.

ఈ నేపథ్యంలో కొన్ని ఆసక్తికర ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పుకొచ్చాడు. తమిళ్ టాప్ హీరో అజిత్ నటిస్తోన్న వాలిమై చిత్రంలో కార్తికేయ విలన్ పాత్రలో నటించాడు. అసలు ఈ సినిమా ఎందుకు సైన్ చేసాడో రీసెంట్ గా తెలియజేసాడు.

వాలిమై దర్శకుడు వినోద్ తెరకెక్కించిన ఖాకీ చిత్రమంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన కథ చెబుతానని అప్రోచ్ అయినప్పుడు హీరో అజిత్ అని తెలియగానే నాకు ఎందుకు నో అనాలో అర్ధం కాలేదు. వెంటనే చేస్తానని చెప్పేసాను అని అన్నాడు కార్తికేయ.


Recent Random Post: