కార్తికేయ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన చావు కబురు చల్లగా సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి మరియు హీరో కార్తికేయ లు తెలుగు రాష్ట్రాల్లో చక్కర్లు కొట్టారు. అన్ని వర్గాల ప్రేక్షకులను కలుసుకుంటూ తమ సినిమా ను ప్రమోషన్ చేసుకుంటూ ఉన్నారు. తాజాగా కాకినాడకు వెళ్లిన చిత్ర యూనిట్ సభ్యులు అక్కడ సందడి చేశారు. అక్కడ టిక్ టాక్ స్టార్ దుర్గా రావుతో కార్తికేయ చేసిన సందడి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది.
ఒక హీరో రోడ్డు మీద తీన్మార్ బ్యాండ్ కు స్టెప్పులు వేయడం పెద్దగా జరుగదు. కాని టిక్ టాక్ స్టార్ దుర్గారావుతో కలిసి కార్తికేయ వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాకినాడకు చేరుకున్న కార్తికేయ అండ్ టీమ్ కు దుర్గారావు తన టీమ్ తో వెల్ కమ్ చెప్పాడు. దుర్గారావు స్టెప్పులు వస్తున్న సమయంలో కార్తికేయ కూడా ఆయనతో తీన్మార్ స్టెప్పులు వేశాడు. ఇక లావణ్య త్రిపాఠి వారి స్టెప్పులను ఎంజాయ్ చేస్తూ వారి వెనుక నడిచింది. మొత్తానికి సినిమా ప్రమోషన్ కోసం కార్తికేయ మరియు లావణ్యలు చాలా కష్టపడుతున్నారు. రేపు విడుదల కాబోతున్న ఈ సినిమా ఫలితం ఏంటీ అనేది చూడాలి.
Recent Random Post: