ప్రముఖ నటుడు, సినీ క్రిటిక్ కత్తి మహేశ్ చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. జూన్ 26న నెల్లూరు జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన తీవ్ర గాయాలపాలైన సంగతి తెలిసిందే. ప్రమాదంలో ఆయన తల, కంటికి తీవ్ర గాయాలయ్యాయి. శస్త్రచికిత్స తర్వాత ఆయన కోలుకుంటున్నారని భావిస్తున్న సమయంలో ఆరోగ్యం విషమించడంతో శనివారం మృతి చెందారు. దీంతో ఆయన అభిమానులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు.
కత్తి మహేశ్ చిత్తూరు జిల్లాలో జన్మించారు. ప్రాధమిక విద్య అక్కడే అభ్యసించి.. ఉన్నత విద్య హైదరాబాద్ లో పూర్తి చేశారు. దర్శకుడు కావాలనే లక్ష్యంతో సినిమాల్లోకి ప్రవేశించారు. పెసరట్టు అనే సినిమాకు దర్శకత్వం కూడా చేశారు. అనంతరం.. హృదయకాలేయం, నేనే రాజు నేనే మంత్రి, క్రాక్.. తదితర చిత్రాల్లో నటించారు. ఆయన సినీ విశ్లేషకుడిగా మంచి పాపులారిటీ సంపాదించారు. బిగ్ బాస్ 1 సీజన్ లో పాల్గొన్నారు. ఆయన మృతి పట్ల సినీ పరిశ్రమ విచారం వ్యక్తం చేసింది.
Recent Random Post: