చిక్కుల్లో కేజీఎఫ్ హీరో యశ్..! నిబంధనలు పాటించలేదంటూ నోటీసులు

కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన కన్నడ స్టార్ హీరో యశ్ చిక్కుల్లో పడ్డారు. కేజీఎఫ్ కు సీక్వెల్ గా వస్తున్న కేజీఎఫ్2 సినిమా టీజర్ లో కొన్ని నిబంధనలు పాటించలేదని నోటీసులు అందుకున్నారు. పొగ తాగడం, మద్యం సేవించడం.. సన్నివేశాలు సినిమాల్లో ఉంటే యాంటి టొబాకో, లిక్కర్ కాషన్ క్యాప్షన్ వేయాల్సి ఉంటుంది. కేజీఎఫ్2 లో అటువంటి నిబంధనలు పాటించలేదని బెంగళూరు యాంటి టొబాకో సెల్ అధికారులు యశ్ కు నోటీసులు ఇచ్చారు.

టీజర్ లో మిషన్ గన్స్ తో భారీ యాక్షన్ సన్నివేశం పూర్తవగానే ఎర్రగా వేడెక్కిన గన్ పై సిగరెట్ వెలిగిస్తాడు యశ్. ఆ సన్నివేశం సమయంలో టుబాకో కాషన్ ప్రదర్శించలేదు. సినిమా అయినా టీజర్ అయినా ఈ నిబంధన తప్పనిసరి. చిత్ర బృందం చేసిన తప్పుకు కర్ణాటక అధికారుల నుంచి యశ్ నోటీసులు అందుకున్నాడు. దీనిపై యశ్ ఎలా స్పందిస్తాడో చూడాల్సి ఉంది.


Recent Random Post: