కన్నడ హీరో యశ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం `కేజీఎఫ్ చాప్టర్ 1′. 1970లలో కోలార్ బంగారు గనుల్లో పనిచేసిన కార్మికుల జీవితాల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిల్మ్స్ బ్యానర్పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ 20 డిసెంబర్ 2018న కన్నడ తెలుగు తమిళం మలయాళం హిందీ భాషల్లో ఏక కాలంలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది.
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం ఊహించని విధంగా అన్ని భాషల్లో సెన్సెషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాతో యశ్ ఓవర్ నైట్ పాన్ ఇండియా స్టార్ అవ్వగా.. ప్రశాంత్ నీల్ యావత్ దేశం దృష్టినే ఆకర్షించాడు.
అలాగే శాండిల్వుడ్ రేంజ్ను కూడా ఈ సినిమా తారా స్థాయికి తీసుకెళ్లింది. అయితే ఇప్పుడు కేజీఎఫ్ చాప్టర్ 1కు కొనసాగింపుగా చాప్టర్ 2 రాబోతున్న సంగతి తెలిసిందే. మొదటి పార్ట్ భారీ విజయాన్ని అందుకోవడంతో కేజీఎఫ్ 2 కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరూ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న కేజీఎఫ్ చాప్టర్ 2 ఏప్రిల్ 14న అట్టహాంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర టీమ్ విసృతంగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే మేకర్స్ కొత్త ట్రెండ్కు తెర లేపారు. అదేంటంటే.. కేజీఎఫ్ 2 ప్రమోట్ చేయడంలో భాగంగా ఫస్ట్ పార్టును రీరిలీజ్కు సిద్ధం చేస్తున్నారట
కేవలం కన్నడ భాషలో మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా కేజీఎఫ్ చాప్టర్ 1 రీరిలీజ్ కాబోతోందని అంటున్నారు. ఇందుకు డేట్ కూడా లాక్ అయింది.
ఇంతకీ ఈ సినిమా విడుదలయ్యేది ఎప్పుడో తెలుసా.. కేజీఎఫ్ చాప్టర్ 2 రావడానికి సరిగ్గా ఆరు రోజుల ముందు అంటే ఏప్రిల్ 8న ఫస్ట్ పార్టును దేశవ్యాప్తంగా నిర్దేశించిన ప్రాంతాల్లో రీరిలీజ్ కానుందట. సబ్సిడీ ధరలకే ఫస్ట్ పార్టును వీక్షించే అవకాశం కూడా కల్పిస్తున్నారని తెలుస్తోంది.
Recent Random Post: