జాతీయ భాషపై హీందీ హీరో అజయ్ దేవ్ గణ్, కన్నడ హీరో సుదీప్ మధ్య ట్విట్టర్ లో జరిగిన చర్చ తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఇప్పుడీ అంశానికి రాజకీయ రంగు పులుముకుంది. కర్ణాటకలో అన్ని పార్టీలు, సీఎం బొమ్మై కూడా సుదీప్ కు మద్దతు పలికారు.
‘దేశంలో ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యం ఇవ్వబట్టే భాషల ప్రకారం రాష్ట్రాలు ఏర్పడ్డాయి. సుదీప్ వ్యాఖ్యలను గౌరవించాల్సిందే’నని అన్నారు. మాజీ సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ‘హిందీ ఎప్పటికీ మన జాతీయ భాష కాదు. దేశంలోని భాషలను ప్రతి భారతీయుడూ గుర్తించాలి. ప్రతి భారతీయుడూ తన మాతృభాషను గౌరవిస్తాడు. నేను కన్నడిగుడిగా గర్విస్తున్నా’నన్నారు.
‘హిందీ పార్టీలు ఎప్పుడూ ప్రాంతీయ భాషలను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. బీజేపీ హిందీవాదానికి అనుగుణంగా అజయ్ మాటలు ఉన్నా’యని మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. దేశంలో 19,500 మాతృభాషలు మాట్లాడుతున్నారు. దేశంపై మా ప్రేమ ప్రతి భాషలోనూ కనిపిస్తుంది’ అని కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ అన్నారు.
Recent Random Post: