పారితోషికం విషయంలో చెట్టెక్కి కూర్చున్న ఉప్పెన భామ

ఉప్పెన సినిమాతో మ్యాజిక్ చేసింది కృతి శెట్టి. నిజానికి ఈ భామ సినిమా విడుదలకు ముందే టాలీవుడ్ ను ఆకర్షించింది. ఉప్పెన ప్రోమోలతోనే కృతి శెట్టి పాపులర్ అయింది. తొలి సినిమా కావడంతో ఉప్పెన ద్వారా ఈ హీరోయిన్ కు పెద్దగా పారితోషికం అందలేదు. కేవలం ఆరు లక్షలకు ఈ సినిమా చేసేసింది. అయితే ఉప్పెన సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పాటు కృతి శెట్టికు చాలా పెద్ద పేరు రావడంతో ఇప్పుడామె పారితోషికం అర కోటి దాటిందని సమాచారం.

మైత్రి మూవీ మేకర్స్ వారు కృతితో మూడు సినిమాల డీల్ ను సైన్ చేయించుకున్నారు. మొదటి సినిమాకు తక్కువలో అవ్వగొట్టేసారు కానీ మిగిలిన రెండు చిత్రాలకు ఆమె అడిగినంత ఇవ్వక తప్పదు. మరోవైపు దర్శకుడు బుచ్చి బాబుకు కూడా పెద్దగా ఏం ముట్టలేదు. ఆయన నెలవారీ జీతానికి పనిచేసినట్లు తెలుస్తోంది. అయితే ఉప్పెన సెన్సేషన్ అవ్వడంతో బుచ్చి బాబు కూడా ఒక ఫిగర్ కోట్ చేయడం ఖాయం.


Recent Random Post: