కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో జన్మించిన అందాల భామ కృతి శెట్టి.. చిన్న తనంలోనే పలు కంపెనీలకు చెందిన యాడ్స్లో నటించింది. చదువుకుంటూనే మరోవైపు తల్లి ప్రోత్సాహంతో మోడలింగ్ వైపు అడుగులు వేసిన కృతి శెట్టి.. హృతిక్ రోషన్ హీరోగా 2019లో వచ్చిన ‘సూపర్ 30’ సినిమాలో ఓ చిన్న రోల్ చేసే అవకాశాన్ని దక్కించుకుంది. ఆపై మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఉప్పెన’ సినిమాతో హీరోయిన్గా కెరీర్ స్టార్ట్ చేసింది.
ఈ మూవీలో బేబమ్మగా నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసిన కృతి శెట్టి.. టాలీవుడ్లో ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ను ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ఈమె చేసిన శ్యామ్ సింగరాయ్ బంగార్రాజు చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి.
దీంతో కృతి శెట్టి స్టార్ హీరోయిన్ల చెంత చేరి పోయింది. ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న ఈ భామ.. త్వరలోనే కోలీవుడ్లోకి అడుగు పెట్టబోతోంది.
తమిళ స్టార్ హీరో సూర్య ఇటీవల తన 41వ చిత్రాన్ని డైరెక్టర్ బాలాతో ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు 18 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న సినిమా ఇది. సూర్య జ్యోతిక సమర్పణలో 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ఈ మూవీ నిర్మితం కానుంది. ఇందులో కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తుండగా.. జీవి ప్రకాష్కుమార్ సంగీతం అందిస్తున్నారు..
అయితే ఇప్పుడు ఈ సినిమాకు కృతి శెట్టి అందుకుంటున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్గా మారింది. ఇప్పటి వరకు తెలుగు సినిమాలకు కోటి వరకు రెమ్యునరేషన్ అందుకున్న కృతి శెట్టి.. సూర్య సినిమాకు మాత్రం ఏకంగా రూ. 1.5 కోట్లు డిమాండ్ చేసిందట. ఇక ఆమెకు ఉన్న క్రేజ్ దృష్ట్యా నిర్మాతలు సైతం అంత మొత్తంలో ఇచ్చేందుకు ఓకే చెప్పారని అంటున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.
కాగా కృతి శెట్టి ప్రస్తుతం తెలుగుతో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో ‘ది వారియర్’ సుధీర్ బాబు సరసన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ నితిన్కు జోడీగా మాచర్ల నియోజవర్గం చిత్రాలు చేస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
Recent Random Post: