వెటరన్ నటి ఖుష్బూ గత కొంత కాలంగా బాగా బరువు పెరిగిన సంగతి తెలిసిందే. రాజకీయారంగేట్రం అనంతరం ఖుష్బూ ఫిట్ నెస్ పై అంతగా శ్రద్ద చూపలేదు. అప్పటికే ఉన్న బరువుతోనే సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి రాణించే ప్రయత్నం మొదలు పెట్టారు. తెలుగు- తమిళ భాషల్లో చాలా సినిమాల్లో నటించారు. అలాగే రాజకీయాల్లోనూ తనదైన శైలిలో ఇప్పటికీ దూసుకుపోతున్నారు. ఇలా రెండింటిని ఖష్ఫూ కొంత కాలంగా బ్యాలెన్స్ చేస్తూ వచ్చారు. అయితే ఉన్నట్లుండి ఖుష్బూ స్టన్నింగ్ లుక్ లో కనిపించి షాకిచ్చారు. పాత రూపం మాయమైంది. సరికొత్త రూపంతో ఛమక్ మనిపించారు. సన్నజాజి సోయగంలా మారిపోయి మేటి కథానాయికనే తలపిస్తున్నారు.
ఖుష్బూ కొత్త ఫోటో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. అందులో ఆమె సన్నజాజి తీగలా కనిపిస్తున్నారు. తాను బాగా బరువు తగ్గినట్లు తానే స్వయంగా చెప్పుకొచ్చారు. ఖుష్బూ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన లుక్ తో ఇప్పుడు మరోసారి మరిపిస్తున్నారు. కొత్త ఫోటోని సోషల్ మీడియా వేదికగా పంచుకుని ` వెయిట్ లాస్ గోల్`..`ఫిట్ నెస్ మోటివేషన్` అని హ్యాష్ ట్యాగ్ లను జోడించారు. ఆరోగ్యంగా ఉండటం కోసం ఎంతో కష్టపడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఎప్పటికప్పుడు ఫిట్ నెస్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని..ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఖుష్బూ ని ఈ లుక్ లో చూసి అభిమానులంతా స్టన్ అవుతున్నారు. స్టన్నింగ్ లుక్..ఇది ఎలా సాధ్యమైంది ? మేడం అంటూ కామెంట్లు పెడుతున్నారు. అనాటి హీరోయిన్ ని మళ్లీ చూపిస్తున్నారని మురిసిపోతున్నారు. ఇక ఖుష్బూ సినిమాల విషయానికి వస్తే సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న `అన్నాథే`లో కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న `ఆడవాళ్లు మీకు జోహార్లు`లో కూడా నటిస్తున్నారు.
Recent Random Post: