సంక్రాంతి సూపర్ క్లాష్ దాదాపు కన్ఫర్మ్ అయినట్లే?!

తెలుగు సినీ ప్రియులకు సంక్రాంతి పండగ చాలా ప్రత్యేకమైంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రతీ ఏటా సంక్రాంతికి బడా సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. ఒక్క సంక్రాంతికే భారీ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడతాయి. సినీ ప్రియులకు ఆ మజానే వేరుగా ఉంటుంది అనడంలో సందేహం లేదు.

2022 సంక్రాంతి దీనికి భిన్నంగా ఏం ఉండబోదు. వచ్చే సంక్రాంతి పండక్కి ఇద్దరు బాక్స్ ఆఫీస్ బొనాంజాలు సంక్రాంతి రేసులో నిలవడం దాదాపు ఖరారైంది. సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా నెలల క్రితమే తన తర్వాతి చిత్రం సర్కారు వారి పాట 2022 సంక్రాంతికి వస్తున్నట్లు ప్రకటించిన విషయం తెల్సిందే.

అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి మల్టీస్టారర్ అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ కూడా సంక్రాంతి రేసులోకి వచ్చింది. ఈ చిత్రాన్ని 2022 సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. సో, మహేష్ వెర్సస్ పవన్ క్లాష్ కు సిద్ధంగా ఉండండి.


Recent Random Post: