టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్లో ప్రస్తుతం ఓ బ్యాడ్ సెంటిమెంట్ తీవ్ర కలవరం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహేష్ తాజా చిత్రం `సర్కారు వారి పాట`. పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రను పోషిస్తున్నారు.
భారత బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల చుట్టూ సాగే ఈ సినిమాలో బ్యాంక్ మేనేజర్ పాత్రలో మహేష్ కనిపించనున్నారు. జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్ 14 రీల్స్ ప్లస్ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు సంయుక్తింగా నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికే విడుదల కావాల్సి ఉన్నా.. పలు కారణాల వల్ల ఏప్రిల్ 1కి వాయిదా పడింది.
అయితే ఇప్పుడు మళ్లీ ఈ చిత్రాన్ని సమ్మర్కి షిప్ట్ చేశారు. తాజాగా సర్కారు వారి పాటను మే 12వ తేదీన విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇదంతా బాగానే ఉంది.. కానీ మహేష్ బాబుకు తన సినీ కెరీర్లో మే నెల పెద్దగా కలిసొచ్చింది లేదు. మే నెలలో వచ్చిన ఈయన చిత్రాలు చాలా వరకు విఫలం అయ్యాయి.
ఎస్.జే. సూర్య దర్శకత్వంలో మహేష్ నటించిన `నాని` చిత్రం 2004 మే 14న విడుదలై ఫ్లాప్గా నిలిచింది. అలాగే మహేష్ బాబు హీరోగా తేజ దర్శకత్వంలో వచ్చిన `నిజం` సినిమా 2003 మే 23న విడుదలైంది. ఈ సినిమాకు గానూ మహేష్ ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్నా.. బాక్సాఫీస్ వద్ద నిజం బోల్తాపడింది. ఇక శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ నటించిన `బ్రహ్మోత్సవం` భారీ అంచనాల నడుమ 2016 మే 20న రిలీజై.. ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
దీంతో మహేష్కు మే నెల కలిసిరాదనే భావన చాలా మందికి వచ్చేసింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ బ్యాడ్ సెంటిమెంట్ ఎఫెక్ట్ `సర్కారు వారి పాట`పై ఎక్కడ పడుతుందో అని ఆయన అభిమానులు తెగ కలవర పడుతున్నారు.
Recent Random Post: