సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ ల కాంబో మూవీ అధికారిక ప్రకటన వచ్చేసింది. వీరిద్దరి కాంబో మూవీ లో హీరోయిన్ గా పూజా హెగ్డే నటించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో తమిళ సూపర్ స్టార్ విజయ్ తో మాస్టర్ సినిమాలో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ మాళవిక మోహన్ ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. మహేష్ బాబుకు చక్కని జోడీగా నే కాకుండా ఈమె ఖచ్చితంగా కథలోని ఆ పాత్రకు సూట్ అవుతుందని త్రివిక్రమ్ భావిస్తున్నాడట.
టాలీవుడ్ లో మాళవిక మోహన్ మొదటి సినిమా విజయ్ దేవరకొండతో చేయాల్సి ఉంది. కాని ఆ సినిమా క్యాన్సిల్ అవ్వడంతో మహేష్ బాబుతో పరిచయం అయ్యేందుకు సిద్దం అయ్యింది. మలయాళంలో ఈమె సినిమా ఎంట్రీ ఇచ్చింది. వరుసగా సినిమాలు చేయకుండా ఆఫర్లు అన్నింటికి కమిట్ అవ్వకుండా ఆచితూచి అడుగులు వేస్తూ కథలను ఎంపిక చేసుకుంటుంది. పెద్ద ఎత్తున ఆఫర్లు వస్తున్న ఈ అమ్మడు కొన్ని సినిమాలు మాత్రమే కమిట్ అవుతోంది.
Recent Random Post: