మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనారోగ్య సమస్యల మధ్య కూడా దేశం కోసం తన బాధ్యతలను నిర్వర్తించిన వైనం నిజంగా స్ఫూర్తిదాయకం. గురువారం రోజు ఆయన కన్నుమూసిన విషయం తెలిసిందే. ఎంతోమంది మహోన్నత నాయకులతో కలిసి పని చేసిన అనుభవం, కఠిన సమయాల్లో కూడా ఎంతో నిబద్ధతో ఉండడం ఆయనకే చెల్లింది. విమర్శలు, ప్రశంసలపై ఏనాడు అతిగా ఉప్పొంగిపోలేదు.
మన్మోహన్ గతంలో ఆయన అనారోగ్యం కారణంగా నడవలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ, దేశ ప్రజల కోసం తన బాధ్యతను నిర్వర్తించడంలో వెనుకడుగు వేయలేదు. ఆయన చేసిన ఎన్నో సేవలకు నిదర్శనంగా నిలిచే సంఘటన 2023 ఆగస్టులో చోటు చేసుకుంది. ఇప్పటికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఢిల్లీ సర్వీసెస్ బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్ జరిగింది. ఈ బిల్లును ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. బిల్లుపై ఓటింగ్ కీలకమైన సమయంలో మన్మోహన్ సింగ్ వీల్‌చైర్‌లో రాజ్యసభకు హాజరై, బిల్లుకు వ్యతిరేకంగా తన ఓటును నమోదు చేశారు. అప్పట్లో ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ, తన బాధ్యతను నిర్లక్ష్యం చేయకుండా సభకు వచ్చారు.
మన్మోహన్ సింగ్ తుది ఫలితం ముందే తెలుసు, ఉపయోగం లేదని కూడా, తన ఓటు ముఖ్యమని భావించి సభకు హాజరవడం గమనార్హం. ఆయన చర్యలు ప్రజా ప్రతినిధిగా తన విధులు ఎంత గౌరవప్రదంగా చూసుకోవాలో ప్రజలకు గుర్తు చేశారు. ఈ అంశంపై నాడు ప్రధాని మోదీ కూడా సభలో ఆయన ధృఢతను ప్రశంసించారు. “మన్మోహన్ సింగ్ చేసిన సేవలు ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయంగా ఉంటాయి.” అని మోదీ వ్యాఖ్యానించారు. ఇక మన్మోహన్ సింగ్ దేశానికి అందించిన సేవలు, ఆర్థిక విధానాలు, క్రమశిక్షణతో దేశంలో మార్పులకు బాటలు వేశాయి. ఆయన జీవితమంతా దేశ సేవలోనే గడిచిందని మరోసారి మోదీ ఆయన ఘనతను గుర్తు చేసుకున్నారు.
Recent Random Post: