లెజెండరీ కమెడియన్‌కు ఛాన్స్‌ ఇస్తానంటున్న వివాదాస్పదన నటి

తెలుగులో శ్రీరెడ్డి ఎంతటి వివాదస్పదన నటినో అంతటి వివాదాలను తమిళ నటి మీరా మిథున్ కూడా సృష్టించింది. స్టార్‌ ను వారి ఫ్యాన్స్‌ ను మరియు కుటుంబాలను కూడా ఇన్వాల్వ్‌ చేసి విమర్శలు చేసిన మీరా మిథున్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కోలీవుడ్‌ లెజెండ్రీ కమెడియన్‌ వడివేలుకు ఎవరు ఆఫర్లు ఇవ్వకున్నా తాను ఆఫర్లు ఇస్తానంటూ ప్రకటించింది. త్వరలో తాను ఒక సినిమాను నిర్మించబోతున్నాను. కావాలంటే వడివేలు గారు ఆ సినిమాలో నటించవచ్చు. ఆయన గౌరవంకు తగ్గట్లుగా పాత్ర ఇస్తాను అంది.

వడివేలు దాదాపు పదేళ్లుగా సినిమాల్లో కనిపించడం లేదు. ఆయన సినిమాల్లో నటించ వద్దని అనుకోలేదు. కాని ఆయన గతంలో చేసిన వ్యాఖ్యల కారణంగా ఆయన్ను కోలీవుడ్‌ అనధికారికంగా బహిష్కరించింది. తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ఇంకా నటించాలనే ఆసక్తి ఉత్సాహం నాకు ఉన్నా కూడా ఆఫర్లు రావడం లేదని బాధ పడ్డాడు. దాంతో సూర్య తన తదుపరి సినిమాలో వడివేలుకు అవకాశం కల్పిస్తున్నట్లుగా ప్రకటించాడు. ఈ సమయంలోనే మీరా మిథున్‌ కూడా తన సినిమాలో ఆయనకు ఆఫర్‌ ఇస్తానంటూ ప్రకటించింది.


Recent Random Post: