రెండు సినిమాల తర్వాత కూడా ఇస్మార్ట్‌ బ్యూటీ ఇంకా అక్కడే ఉంది

ఇస్మార్ట్‌ శంకర్ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన ముద్దుగుమ్మ నభా నటేష్‌. ఈ అమ్మడు అంతకు ముందు సినిమాలు చేసినా కూడా పెద్దగా జనాలకు పరిచయం అయ్యింది లేదు. కాని ఎప్పుడైతే ఇస్మార్ట్‌ శంకర్‌ లో మాస్‌ పాత్ర చేసిందో అప్పటి నుండి ఈమె గురించి సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతుంది. ఇస్మార్ట్ శంకర్‌ ఎఫెక్ట్‌ తో ఈ అమ్మడికి వరుసగా ఆఫర్లు వచ్చాయి. కొన్ని సినిమాలు తాజాగా వచ్చాయి. సోలో బ్రతుకే సో బెటర్‌ మరియు అల్లుడు అదుర్స్‌ సినిమాలతో ఈమె వచ్చింది.

ఈ రెండు సినిమాలు కూడా నిరాశ పర్చాయి. సోలో బ్రతుకే సో బెటర్‌ లో ఈమె పాత్ర కాస్త పర్వాలేదు అన్నట్లుగా ఉన్నా కూడా ఇస్మార్ట్ శంకర్‌ ఇమేజ్ ను తూడ్చేయలేదు. దాంతో ఇప్పటికి ఈమెను ఇస్మార్ట్‌ శంకర్‌ హీరోయిన్‌ గానే అభిమానులు మరియు ప్రేక్షకులు పిలుస్తున్నారు. వరుసగా ఈమె చేస్తున్న సినిమాల విడుదల తర్వాత అయినా ఇస్మార్ట్‌ శంకర్‌ గుర్తింపు నుండి బయటకు వచ్చి మరో స్టెప్‌ వేసేనా అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు ఎదురు చూస్తున్నారు.


Recent Random Post: