అక్కినేని నాగ చైతన్య నటిస్తోన్న తాజా చిత్రం థాంక్యూ. ఈ సినిమాలో హీరోయిన్ గా రాశి ఖన్నా నటిస్తోంది. మనం ఫేమ్ విక్రమ్ కె కుమార్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో గత కొంత కాలం నుండి షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం ఇప్పుడు చిత్రీకరణ మొత్తాన్ని పూర్తి చేసుకుంది.
గత నెలలో థాంక్యూ టీమ్ ఇటలీ వెళ్ళింది. అక్కడ ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను, రెండు పాటలను షూట్ చేసారు. ఈరోజుతో ఇటలీ షెడ్యూల్ పూర్తయింది. దీంతో థాంక్యూ షూటింగ్ మొత్తం పూర్తయినట్లు తెలుస్తోంది.
థాంక్యూ టీమ్ మొత్తం హైదరాబాద్ చేరుకుంటుంది. పరిస్థితులు సద్దుమణిగాక పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలవుతాయి. దాని తర్వాత సినిమా విడుదలపై నిర్ణయం తీసుకుంటారు. థాంక్యూ చిత్రానికి సంబంధించిన మరింత సమాచారం త్వరలో బయటకు రానుంది.
Recent Random Post: