అక్కినేని నాగచైతన్య వరస సినిమాలతో జోరు మీదున్నాడు. లవ్ స్టోరీ సినిమా విడుదల కాకుండానే మరో సినిమాను దాదాపుగా పూర్తి చేసేసాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి హీరోయిన్ గా తెరకెక్కిన లవ్ స్టోరీ ఏప్రిల్ లో విడుదల కావాల్సింది కానీ కరోనా పరిస్థితుల నేపథ్యంలో వాయిదా పడింది.
నాగ చైతన్య విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థాంక్యూ చిత్రం కూడా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగింది. ఇటలీలో ఈ చిత్ర షూటింగ్ దాదాపుగా నెల రోజుల పాటు సాగింది. గత నెలలో టీమ్ అంతా ఇండియా తిరిగి వచ్చారు. షూటింగ్ దాదాపు పూర్తయింది.
ఇదిలా ఉంటే నాగ చైతన్య మరో సినిమాకు పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తోంది. నాగ చైతన్య హీరోగా ఎంటర్టైనింగ్ సినిమాలతో ఎదుగుతోన్న వెంకీ కుడుముల దర్శకత్వంలో సినిమా రూపొందనుంది. ఛలో, భీష్మ సినిమాలతో తానేంటో నిరూపించుకున్నాడు ఈ దర్శకుడు.
Recent Random Post: