కరోనా సెకండ్ వేవ్.. మెగా ఫ్యామిలీ సన్నిహిత వ్యక్తి మృతి

కరోనా సెకండ్ వేవ్ చాలా భయంకరంగా ఉంది. మొదటి వేవ్ కంటే దారుణంగా పాజిటివ్ కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది కరోనా కారణంగా కన్నుమూశారు. మెగా ఫ్యామిలీకి సంబంధించి సన్నిహిత వ్యక్తి అంబటి రాజా కరోనా కాటుకు బలైనట్లు తెలుస్తోంది.

పలు కార్యక్రమాలకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసారు రాజా. మెగా ఫ్యామిలీకి ముఖ్యంగా నాగబాబుతో చాలా దగ్గర సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. కొంత కాలం క్రితం రాజాకు కరోనా సోకగా దాన్నుండి కోలుకుంటున్నారు. అయితే సడెన్ గా ఈరోజు ఉదయం ఆయన ఆరోగ్యం విషమించింది. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆయన్ను కాపాడలేకపోయారు.

రాజా మరణ వార్త విని ఇండస్ట్రీలోని చాలా మంది తమ సంతాపాన్ని తెలియజేసారు. నటుడు కృష్ణుడు, వెంకట్ రాహుల్, దర్శకుడు విఎన్ ఆదిత్య తదితరులు రాజా ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.


Recent Random Post: