నందమూరి బాలకృష్ణ మా ఎన్నికల విషయమై స్పందించేందుకు ఇష్టం లేదు అంటూనే ఇన్నాళ్లు ఎందుకు మా భవనం కట్టలేదు. అందుకోసం ఎందుకు ప్రయత్నాలు సాగలేదు అంటూ ప్రశ్నించాడు. ఆ విషయమై నాగబాబు ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. మా అసోషియేషన్ కు ఎన్నికలు అవసరం లేదని కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏ అసోషియేషన్ అయినా ఎన్నికలు ఉండాల్సిందే. ఏకగ్రీవం అనేది తప్పుడు నిర్ణయం అవుతుంది. పోటీ జరిగినప్పుడు మాత్రమే మంచి అభ్యర్థి వస్తాడని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ఇక మా భవనం గురించి ప్రయత్నాలు ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి. మురళి మోహన్ గారు మా భవనం గురించి కాస్త సీరియస్ గా ప్రయత్నించి ఉంటే తప్పకుండా అయ్యేది. ఆ తర్వాత వారు చాలా సార్లు ప్రయత్నాలు చేశారు. శివాజీ రాజా ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో ఫండ్ రైజింగ్ కూడా జరిగింది. కాని నరేష్ హయాంలో మాత్రం ఏం జరగలేదు అన్నాడు. ఇక ప్రకాష్ రాజ్ కు పక్కా విజన్ ఉంది. ఆయనకు అన్ని విషయాలపై క్లారిటీ ఉంది. అందుకే ఆయనకు మద్దతు ఇస్తున్నాం అన్నాడు. ఏకగ్రీవం కావాలంటే అందరు తప్పుకుంటే ప్రకాష్ రాజ్ అవుతాడు అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఇక మంచు విష్ణు మా భవనం కోసం పూర్తి డబ్బు చెల్లిస్తాను అనడం మంచిదే. కాని భవనం స్థలం గురించి ఆయనకు క్లారిటీ ఉందా అంటూ నాగబాబు ప్రశ్నించాడు.
Recent Random Post: