వకీల్ సాబ్ సినిమాను పాచిపోయిన సినిమా అంటూ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వకీల్ సాబ్ గురించి ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అయిన నేపథ్యంలో మెగా ఫ్యామిలీ నుండి నాగబాబు స్పందించాడు. వకీల్ సాబ్ గురించి నాని చేసిన వ్యాఖ్యలు చాలా సీరియస్ కౌంటర్ ను నాగబాబు ట్విట్టర్ ద్వారా ఇవ్వడం అభిమానులకు ఆనందంను కలిగించింది. వైకాపా ప్రభుత్వం వకీల్ సాబ్ పై నీచమైన బుద్దిని కనబర్చింది. వారి కి సరిగ్గా నాగబాబు సమాధానం చెప్పాడు అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
నాగబాబు ట్విట్టర్ లో… మీకు ఏమైంది నాని గారు. మీరు కరోనా వ్యాక్సిన్ తో పాటు రాబిస్ వ్యాక్సిన్ కూడా తీసుకోవాలి. ఇట్స్ అర్జంట్. దయచేసి ఎవరైనా మంత్రి కి రాబిస్ వ్యాక్సిన్ ను పంపించండి. వ్యాక్సిన్ ను ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే ముందుకు రావచ్చు అంటూ ఈ సందర్బంగా నాగాబాబు పేర్కొన్నాడు. మొత్తానికి మంత్రి నాని వ్యాఖ్యలపై నాగబాబు సీరియస్ గా స్పందించిన నేపథ్యంలో ఇప్పుడు నాని ఎలా రియాక్ట్ అవుతాడు అనేది చూడాలి.
Recent Random Post: