యువ దర్శకులకు నాగార్జున కీలక సూచన కమ్‌ వార్నింగ్‌

నాగార్జున తాజాగా రానా టాక్ షో నెం.1 యారి లో పాల్గొన్నాడు. వైల్డ్‌ డాగ్‌ సినిమా ప్రమోషన్‌ లో భాగంగా ఈ ఇంటర్వ్యూను నాగార్జున ఇవ్వడం రానా చేయడం జరిగింది. కాని వైల్డ్‌ డాగ్‌ వచ్చి వెళ్లి పోయిన తర్వాత కాని నెం.1 యారి షో ప్రసారం కాలేదు. సరే ఆ విషయం పక్కన పెడితే నాగార్జున నెం.1 యారి షో లో పలు ఆసక్తికర విషయాలను మాట్లాడాడు. ఇదే సమయంలో ఇండస్ట్రీ పై తనకు ఉన్న ఫ్రస్టేషన్‌ అంతా కూడా తీర్చుకునేలా కాస్త సీరియస్ గానే కక్కేశారు.

షో లో ఆయన మాట్లాడుతూ.. ఈ తరం దర్శకులు ఎందుకు ఒక సినిమాకు ఇంత సమయం తీసుకుంటున్నారో అర్థం అవ్వడం లేదు అంటూ అసహనం వ్యక్తం చేశాడు. 90 ల్లో సినిమాను కేవలం 50 రోజుల్లోనే పూర్తి చేసే వాళ్లం. ఎంత పెద్ద సినిమా అయినా రెండు నెలలకు మించి ఉండక పోయేది. కాని ఈతరం దర్శకులు మాత్రం ఏళ్లకు ఏళ్లు తీస్తున్నారు. 50 రోజుల్లో సినిమాను పూర్తి చేయడం నేర్చుకోండి అంటూ నాగార్జున యంగ్‌ దర్శకులకు సూచించాడు. సినిమాను ఎంత తక్కువ రోజుల్లో పూర్తి చేస్తే నిర్మాతకు అంత లాభం ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.


Recent Random Post: