ప్రస్తుతం సినిమా పరిశ్రమ అంతా కూడా డిజిటల్ మయం దిశగా పరుగులు తీస్తోంది. సినిమాలు ఓటీటీలో విడుదల అవుతున్నాయి, వెబ్ సిరీస్ లు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఓటీటీ కంటెంట్ కు ఉన్న ప్రముఖ్యత నేపథ్యంలో ఇప్పటికే బాలీవుడ్ స్టార్స్ పలువురు వెబ్ సిరీస్ ల్లో నటించిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన వెబ్ సిరీస్ లు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకున్నాయి. అయితే టాలీవుడ్ నుండి ఇప్పటి వరకు వెబ్ సిరీస్ ల్లో నటించిన స్టార్ హీరోలు ఎవరు లేరు. మొదటి సారి నాగార్జున ఆ జాబితాలో చేరబోతున్నాడు.
టాలీవుడ్ స్టార్ హీరోలకు ఇప్పటి వరకు కూడా వెబ్ సిరీస్ లు అంటే చిన్న చూపు ఉంది. కాని నాగార్జున మాత్రం వెబ్ సిరీస్ ల్లో నటించేందుకు తనకు సమ్మతమే అని ప్రకటించాడు. ఇప్పటికే హిందీ లో రెండు వెబ్ సిరీస్ లను చేసేందుకు ఓకే చెప్పానని కూడా చెప్పుకొచ్చాడు. వెబ్ సిరీస్ ల్లో నటించడం వల్ల హద్దుల్లో తమ పాత్రను ఉంచాల్సిన అవసరం లేదు. నటనకు హద్దులు లేకుండా అద్బుతమైన కాన్సెప్ట్ లతో ముందుకు వెళ్లవచ్చు. అందుకే వెబ్ సిరీస్ ల్లో నటించేందుకు నాగార్జున సిద్దం అయ్యాడు. నాగ్ నటించిన వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ద్వారా ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. నాగ్ తర్వాత మరెవ్వరు వెబ్ దారి పడతారో చూడాలి.
Recent Random Post: