హీరోయిన్‌గా సూపర్ ఫామ్‌లో ఉన్నారు కాజల్ అగర్వాల్. ప్రస్తుతం చిరంజీవి సరసన ‘ఆచార్య’లో నటిస్తున్నారు. కమల్‌హాసన్‌తో ‘ఇండియన్ 2’, తమిళంలో ఓ రెండు సినిమాలతో బిజీగా ఉన్నారామె. ఇప్పుడు మరో సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. నారాయణ్‌దాస్ నారంగ్, పుస్కూరు రామ్మోహన్ రావు, శరత్ మరార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇందులో హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ నటించనున్నట్లు చిత్రబృందం గురువారం అధికారికంగా ప్రకటించింది. ‘‘నాగార్జునతో తొలిసారి నటించబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా కెరీర్‌లో ఇప్పటివరకు ఇలాంటి పాత్ర చేయలేదు’’ అని అన్నారు. గోవా, హైదరాబాద్, ఊటీ, లండన్ లొకేషన్స్‌లో ఈ సినిమా షూటింగ్ జరగనుంది. ఈ సినిమాకు బోనీ జైన్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Recent Random Post: