వ్యవసాయంలో పూర్తిగా నిమగ్నమైపోయిన నవాజుద్దీన్!

Share

బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిక్ వ్యవసాయ కుటుంబం నుండి వచ్చాడు. ఇప్పటికీ తన సొంతం రాష్ట్రంలో నవాజుద్దీన్ కుటుంబంతా వ్యవసాయమే చేస్తోంది. ఉత్తరప్రదేశ్ లోని బుదానాలో నవాజుద్దీన్ కు పొలాలు ఉన్నాయి. గతేడాది షూటింగులు లేకపోవడంతో తన సొంత రాష్ట్రానికి వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకున్నాడు. ఆ తర్వాత లాక్ డౌన్ ఎత్తివేయడంతో కొన్ని నెలలు షూటింగ్ లో పాల్గొన్న ఈ టాలెంటెడ్ నటుడు ఇప్పుడు మళ్ళీ వ్యవసాయమే చేస్తున్నాడు.

ప్రస్తుతం ముంబైలో షూటింగ్స్ మొదలయ్యాయి. అయినా కానీ నవాజుద్దీన్ తన రాష్ట్రంలోనే ఉన్నాడు. స్వయంగా తనే పొలంలోకి దిగి ఒక సాధారణ రైతులా పనులు చేసుకుంటున్నాడు. అతడు దగ్గరుండి రైతుల చేత పంటలు కూడా వేయించాడు. పంటలు పూర్తై చేతికి వచ్చే వరకూ అక్కడి నుండి రానని చెప్పాడు. నవాజుద్దీన్ పొలాలకు వెళ్లి పనిచేస్తోన్న ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.


Recent Random Post: