కరోనా మహమ్మారి ప్రస్తుతం దేశం మొత్తాన్ని పట్టిపీడిస్తోంది. దేశ ప్రజలు అందరూ రకరకాలుగా ఈ మహమ్మారి వలన ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్య పరంగానే కాక, ఆర్ధికంగా, మానసికంగా కృంగిపోతున్నారు. ఇదిలా ఉంటే సినీ సెలబ్రిటీలు తమకు తోచిన దారిలో సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు.
సోను సూద్ ఎన్నో రకాల సహాయాలు చేస్తున్నాడు. చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్ నెలకొల్పుతున్నాడు. హీరో నిఖిల్, నటుడు జీవన్ కూడా ఈ తరహా సహాయాలు చేస్తున్నారు. నటి నిధి అగర్వాల్ గతేడాది కరోనా సమయంలో ఎంతో సహాయం చేసింది.
ఈ ఏడాది కూడా ఆమె డిస్ట్రిబ్యూట్ లవ్ పేరుతో ఒక ఆర్గనైజేషన్ ను స్థాపించింది. కరోనా సమయంలో ఎవరైనా సహాయం కావాలి అని అనుకుంటే ఒక వెబ్ సైట్ ద్వారా ఆ ఆర్గనైజేషన్ కు రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. వచ్చిన రిక్వెస్ట్ లను బట్టి తమకు తోచిన సహాయాలు చేస్తూ ఉంటారు.
Recent Random Post: