నిహారిక పెళ్లి కార్డు భలేగుందే

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక పెళ్లి పీటలు ఎక్కనున్న విషయం తెల్సిందే. గుంటూరు ఐజీ కుమారుడు, హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోన్న చైతన్య జొన్నలగడ్డను వివాహమాడనుంది. ఆగస్ట్ లో వీరి నిశ్చితార్ధం జరిగిన విషయం తెల్సిందే. ఇక పెళ్లి వేడుక డిసెంబర్ 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు జరగనుంది.

రాజస్థాన్ లోని ఉదయపూర్ ప్యాలెస్ లో వీరి వివాహం జరగనుంది. ఇప్పటికే పెళ్లి పనులు ఓ కొలిక్కి వచ్చాయి. ఇటీవలే నిహారిక రాజస్థాన్ వెళ్లి పెళ్లి పనులను సమీక్షించింది కూడా. ఇక మెగా ఫ్యామిలీ వారి పెళ్లి కార్డు ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ కార్డు బయటకు వచ్చింది, నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.

సాధారణంగా పెద్ద ఇళ్లల్లో పెళ్లి కార్డులు చాలా ఆడంబరంగా ఉంటాయి కానీ ఈ కార్డు చాలా సింపుల్ గా ఉంది. పెళ్లి కార్డుపై చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ పేర్లు కార్డుపై ఉన్నాయి. మెగా ఫ్యామిలీ మొత్తం ఈ వివాహ వేడుకకు తరలివెళ్లనుంది.

ఇక డిసెంబర్ 11న హైదరాబాద్ లోని జెఆర్సి కన్వెన్షన్ సెంటర్ లో గ్రాండ్ రిసెప్షన్ ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి మెగా ఫ్యామిలీ ఇంట పెళ్లి సందడి మొదలైంది.


Recent Random Post: