మెగా బ్రదర్ నాగబాబు తన కూతురు నిహారికకు పూర్తి స్వేచ్చ ఇచ్చాడు. తండ్రి ఇచ్చిన స్వేచ్చను ఆమె ఎప్పుడు కూడా వృదా చేసుకోలేదు. ఉద్యోగం చేయనిచ్చాడు.. షో కు హోస్టింగ్ చేసేందుకు ఒప్పుకున్నాడు.. సినిమాల్లో నటించేందుకు అంగీకరించాడు.. నిర్మాతగా మారేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అంతగా కూతురును అల్లారు ముద్దుగా నాగబాబు పెంచాడు అంటూ ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. ఇక నిహారిక వివాహంకు అంతా సిద్దం అయ్యింది. ఆమె కోరుకున్నట్లుగా డెస్టినేషన్ వెడ్డింగ్ ను ప్లాన్ చేశారు.
పెళ్లికి మరి కొన్ని రోజులే ఉన్న నేపథ్యంలో వరుసగా నిహారిక బ్యాచిలర్స్ పార్టీలు ఇస్తూ బిజీ బిజీగా గడిపేస్తుంది. ఇండస్ట్రీ వారికి.. స్కూల్ ఫ్రెండ్స్.. కాలేజ్ ఫ్రెండ్స్.. ఫ్యామిలీ ఇలా ఎన్నో బ్యాచిలకు విడి విడిగా బ్యాచిలర్స్ పార్టీలు ఇస్తూ వస్తుంది. గత మూడు నాలుగు రోజులుగా అదే పనిగా ఉన్న నిహారిక తాజాగా మెగా ఫ్యామిలీ మెంబర్స్ కు పార్టీ ఇచ్చింది. ఈ పార్టీలో మెగా యూత్ పాల్గొన్నారు. నిహారిక ఇస్తున్న ఎక్కువ పార్టీల్లో ఆమె కాబోయే భర్త కూడా పాల్గొంటున్నాడు.
మరో వైపు ఆయన కూడా పార్టీలు ఇవ్వడం ఆమె పాల్గొనడం జరుగుతుంది. మొత్తానికి గత కొన్ని రోజులుగా నిహారిక పార్టీ మూడ్ లోనే ఉన్నారు. ఇద్దరు కూడా బ్యాచిలర్స్ పార్టీలను ఎంజాయ్ చేస్తున్నట్లుగా మీడియాలో వస్తున్న ఫొటోలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక రెండు రోజుల్లో ఉదయ్ పూర్ లో పెళ్లి తంతు మొదలు కాబోతుంది. సంగీత్ మరియు మెహెందీ ఇలా అన్ని విధాలుగా కార్యక్రమాలు జరుగబోతున్నాయి. అయిదు రోజుల పాటు పెళ్లి వేడుకలు జరుగుతూనే ఉంటాయి. హైదరాబాద్ లో భారీ ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Recent Random Post: