‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ ప్రతి ఫ్యామిలీకి నచ్చుతుంది

తెలుగులో వెబ్ సిరీస్ ను మొదలుపెట్టినవారిలో నిహారిక కొణిదెల ముందువరుసలో కనిపిస్తారు. యాంకర్ గా .. హోస్టుగా .. హీరోయిన్ గా నిహారిక తనని తాను నిరూపించుకున్నారు. ఇక తాను నిర్మించిన వెబ్ సిరీస్ లోను నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. వివాహమైన తరువాత మళ్లీ ఆమె ఒక వెబ్ సిరీస్ ను నిర్మించారు. ఆ వెబ్ సిరీస్ పేరే ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’. ఈ నెల 19 నుంచి ఈ వెబ్ సిరీస్ జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్న రాత్రి నిర్వహించారు. వరుణ్ తేజ్ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమం జరిగింది.

ఈ వేదికపై నిహారిక మాట్లాడుతూ .. “నేను ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ బ్యానర్ ను 6 ఏళ్ల క్రితం ప్రారంభించి ‘ముద్దపప్పు ఆవకాయ’ చేశాను. ఆ తరువాత మా నాన్నగారితో కలిసి ‘నాన్నకూచి’ చేశాను. ఆ రెండు ప్రాజెక్టులు కూడా జీ 5 ద్వారానే స్టీమింగ్ అవుతున్నాయి. మళ్లీ ఇప్పుడు ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ అనే ఒక కామెడీ ఫ్యామిలీ డ్రామా చేశాను. ప్రతీదీ కూడా నాకు చాలా స్పెషల్. ప్రతి వెబ్ సిరీస్ నచ్చడం వలన నేను చాలా ఇష్టంగా ట్రావెల్ అవుతూ వస్తున్నాను. ఈ వెబ్ సిరీస్ కథను దర్శకుడు మహేశ్ ఉప్పాల నాకు చెప్పినప్పుడు ‘ఇది మీ స్టోరీ యేనా?’ అని అడిగాను.

అంత సహజంగా ఆయన ఈ కథను చెప్పారు. తను చూసిన కొన్ని సంఘటనల చుట్టూ ఈ కథను అల్లుకున్నాని చెప్పారు. ఈ వెబ్ సిరీస్ డైరెక్టర్ .. రైటర్ ఇద్దరూ కూడా నిద్ర కూడా లేకుండా వర్క్ చేశారు. ఈ ప్రాజెక్టు కోసం వాళ్లు హండ్రెడ్ పెర్సెంట్ కష్టపడ్డారు. సంగీత్ శోభన్ ను హీరో అంటే ఆయనకి నచ్చదు .. తనని ఇష్టపడని వాళ్లంటూ ఉండరు. ఆయన చాలా టాలెంటెడ్. ఈ వెబ్ సిరీస్ లో హీరోయిన్ పాత్ర కోసం చాలా చాలా వెతికాం. చివరికి సిమ్రాన్ ను ఓకే చేశాము. తను చాలా హార్డ్ వర్కర్ .. ఈ వెబ్ సిరీస్ కోసమే ఆమె తెలుగు నేర్చుకున్నారు.

ఇక నరేశ్ గారు ఇంతవరకూ వెబ్ సిరీస్ చేయలేదు .. నా కోసం ఒప్పుకున్నారు. ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’లో ఆయన చాలా పెద్ద పార్టును ప్లే చేశారు. తులసి గారు కూడా నా కోసం ఒప్పుకున్నారు .. ఆమె కథ కూడా వినలేదు. గతంలో వాళ్లతో నేను ఒక సినిమాలో చేశాను .. ఆ చనువుతో వాళ్లను అడిగాను. వేరే షూటింగులో ఉండటం వలన తులసి గారు ఇక్కడికి రాలేకపోయారు. మళ్లీ వాళ్లతో కలిసి చేయాలనుకుంటున్నాను. చిన్న ఫ్యామిలీ స్టోరీనే అయినా ప్రతి పాత్ర చాలా ముఖ్యమైనదిగా ఉంటుంది. టెక్నీషియన్స్ కూడా ఇది వెబ్ సిరీస్ లా కాకుండా ఒక సినిమాగానే అనుకుని చాలా కష్టపడ్డారు. ఈ సందర్భంగా నేను జీ టీమ్ కు థ్యాంక్స్ చెబుతున్నాను” అంటూ ముగించారు.


Recent Random Post: