No Haleem This Ramzan In Hyderabad?

Share

రామ్‌ గోపాల్‌ వర్మ ఎక్కడ ఉంటే సంచలనం అక్కడ ఉంటుంది… లేదంటే సంచలనం ఎక్కడ ఉంటే రామ్‌ గోపాల్‌ వర్మ అక్కడ ఉంటాడు. వర్మ ఈమద్య కాలంలో కేవలం సంచలనాలతోనే మీడియాలో ఉంటున్నాడు. గతంలో అద్బుతమైన సినిమాలు తెరకెక్కించి జనాల్లో ఉన్న వర్మ ఇప్పుడు సంచలనాలు సృష్టించి మరీ మీడియాలో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. తనకు సంబంధం ఉన్నా లేకున్నా కూడా సంచలనాత్మక విషయాలు ఏమైనా జరిగితే వెంటనే అక్కడ వాలిపోయి సినిమాను తీసేందుకు రెడీ అవుతున్నాడు.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇండియాలో లాక్‌ డౌన్‌ విధించిన విషయం తెల్సిందే. షూటింగ్స్‌ అన్ని కూడా బంద్‌ అయ్యాయి. వర్మ మాత్రం కరోనా వైరస్‌ గురించి స్క్రిప్ట్‌ రెడీ చేసి పెట్టినట్లుగా చెబుతున్నాడు. ఎప్పుడైతే లాక్‌డౌన్‌ ఎత్తివేస్తారో అప్పుడు వెంటనే సినిమాను చేస్తానంటూ ప్రకటించాడు. పోలీసులు, డాక్టర్లు, ప్రభుత్వాలు కరోనాపై పోరాడుతూ ఉంటే వర్మ ఆ వైరస్‌కు వ్యతిరేకంగా సినిమాను చేసేందుకు సిద్దం అయ్యాడు.

ఇప్పటికే పురుగు అంటూ ఒక పరమ అసహ్యమైన వీడియోను విడుదల చేసిన వర్మ సినిమాను కూడా అలాగే తీస్తాడా అంటున్నారు. ఆ పాట నిజంగా వైరస్‌ వింటే బాబోయ్‌ అంటూ వాంతులు చేసుకునేదేమో. పాటతోనే అంత చేసిన వర్మ సినిమాలో ఇంకా కరోనా వైరస్‌ గురించి ఎలాంటి సీన్స్‌ తీస్తాడో కదా అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. వర్మ ఖచ్చితంగా ఈ ఈసినిమాను జనాలు మెచ్చేలా తీయడు. కాని జనాల్లో చర్చ జరిగేలా మాత్రం పబ్లిసిటీ చేస్తాడంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు.


Recent Random Post:

Bigg Boss Telugu 9 | Day 88 Promo 2 | Finalist Race 💥⚔️ | Nagarjuna

December 4, 2025

Share

Bigg Boss Telugu 9 | Day 88 Promo 2 | Finalist Race 💥⚔️ | Nagarjuna