తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 లో నోయల్ స్టార్ కంటెస్టెంట్ గా వెళ్లిన విషయం తెల్సిందే. హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన వారిలో ఎక్కువ శాతం మంది కనీసం తెలియని వారు ఉన్నారు. అలాంటి వారిలో నోయల్ కాస్త తెలిసిన మొహం అవ్వడం వల్ల అంతా కూడా ఆయనపై చాలా ఆశలు పెట్టుకున్నారు. పాటలు పాడుతూ ఎంటర్ టైన్ మెంట్ చేస్తాడని ఆశించారు. కాని నోయల్ కు వెళ్లినప్పటి నుండి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టాయి. గంగవ్వ మరియు నోయల్ లకు రెగ్యులర్ గా మెడికల్ సపోర్ట్ కావాల్సి వచ్చింది. మొదట గంగవ్వను అనారోగ్య కారణాల వల్ల బయటకు పంపించిన బిగ్ బాస్ ఆ తర్వాత నోయల్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారడంతో ఆయన్ను కూడా బయటకు పంపించారు.
నోయల్ బయటకు వచ్చిన తర్వాత రాహుల్ తో ఇంటర్వ్యూ తప్ప ఎక్కడ కనిపించలేదు. మీడియాకు దూరంగా.. సిటీకి కూడా దూరంగా నోయల్ ఉంటున్నాడు. నోయల్ ను ఎట్టకేలకు హారిక బ్రదర్ తెర పైకి తీసుకు వచ్చాడు. అయిష్టంగానే హారిక బ్రదర్ కు ఇంటర్వ్యూ ఇచ్చేందుకు నోయల్ ఓకే చెప్పాడు. బిగ్ బాస్ లో ఏం నేర్చుకున్నారు అంటూ ప్రశ్నించిన సమయంలో అసలు బిగ్ బాస్ కు ఎందుకు వెళ్లానా అనిపిస్తుంది. బిగ్ బాస్ కు వెళ్లి పెద్ద తప్పు చేశాను. వెళ్లకుండా ఉండాల్సిందని పశ్చాతాప పడుతున్నట్లుగా పేర్కొన్నాడు.
నోయల్ బిగ్ బాస్ కు వెళ్లి బ్యాడ్ ఏమీ కాలేదు. ఆయన ఎందుకు అలా అన్నాడు అనేది అర్థం కాలేదు. బిగ్ బాస్ కు వెళ్లడం వల్ల ఆయన అనారోగ్య సమస్యల గురించి బయటకు తెలిసింది. అంతకు మించి ఏమీ బ్యాడ్ అవ్వలేదు. అయినా కూడా ఎందుకు పునర్నవి మాదిరిగా బిగ్ బాస్ కు వెళ్లి తప్పు చేశాను అంటున్నాడో అంటూ నెటిజన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పున్ను కూడా బిగ్ బాస్ కు వెళ్లకుండా ఉంటే బాగుండేది అంటూ పదే పదే అంటూ ఉంటుంది. ఇప్పుడు నోయల్ కూడా అదే మాట అంటున్నాడు.
Recent Random Post: