యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్లాన్స్ అన్ని కూడా కరోనా కారణంగా తలకిందులు అయినట్లుగా అనిపిస్తున్నాయి. గత ఏడాది ఎన్టీఆర్, కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ల కాంబో మూవీ పై చాలా వార్తలు వచ్చాయి. మైత్రి మూవీ మేకర్స్ ఏకంగా ప్రశాంత్ నీల్ కు అడ్వాన్స్ ఇచ్చారంటూ ప్రచారం జరిగింది. కాని ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన ఎలాంటి ప్రకటనను మైత్రి వాళ్లు చేయలేదు. ఈ సమయంలోనే కేజీఎఫ్ పూర్తి అయిన వెంటనే ప్రభాస్ తో సలార్ చిత్రాన్ని చేసేందుకు ప్రశాంత్ నీల్ సిద్దంగా ఉన్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది.
వచ్చే ఏడాది జనవరిలోనే సలార్ మూవీ పట్టాలెక్కబోతుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ మూవీ క్యాన్సిల్ అయినట్లేనా అంటూ నందమూరి అభిమానులు ఒకింత నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో ఎన్టీఆర్ సన్నహితులు స్పందిస్తూ ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్‌ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి అయిన తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి అవ్వడానికి 2021 చివరి వరకు సమయం పడుతుంది. అందుకే ప్రశాంత్ నీల్ ఈ గ్యాప్ లో ఒక సినిమాను చేసేందుకు ప్రభాస్ తో సలార్ మొదలు పెట్టాడు. సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ చేయబోతున్నది ఎన్టీఆర్ తోనే అంటూ వారు నమ్మకంగా చెబుతున్నారు.
Recent Random Post: