ఈసారి ఎన్టీఆర్‌ ఘాట్ వద్దకు వెళ్లని నందమూరి ఫ్యామిలీ

ప్రతి సంవత్సరం నందమూరి తారక రామారావు వర్ధంతి మరియు జయంతి సందర్బంగా కుటుంబ సభ్యులు ఖచ్చితంగా హైదరాబాద్‌ లో ఉన్న ఎన్టీఆర్‌ ఘాట్ ను సందర్శించడం ఆనవాయితీగా వస్తుంది. ఎన్టీఆర్‌ ఘాట్ ను నేడు ఎన్టీఆర్‌ జయంతి సందర్బంగా మాత్రం ఎవరు సందర్శించలేదు. కరోనా లాక్ డౌన్ ఆంక్షలు ఉన్న కారణంగా నందమూరి అభిమానులతో పాటు కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఈసారి ఘాట్‌ ను సందర్శించలేదు.

ఎన్టీఆర్‌ తనయుడు రామకృష్ణ ముందే ఈ విషయాన్ని వెళ్లడించారు. ఈసారి కుటుంబ సభ్యులు ఎవరు కూడా జయంతి సందర్బంగా ఘాట్‌ ను సందర్శించేందుకు వెళ్లడం లేదని ఆయన పేర్కొన్నారు. అబిమానులు కూడా అటు వైపు వెళ్లేందుకు పోలీసుల నుండి అనమతి లేదు. ఉదయం 10 గంటల వరకు అనుమతులు ఉన్నా కూడా కరోనా ఆంక్షలు కఠినంగా ఉన్న ఈ సమయంలో ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఈ సారి సందడి వాతావరణం కనిపించడం లేదు. వచ్చే ఏడాది ఆయన 100వ జయంతి. ఆ సమయంలో అయినా కార్యక్రమాలు నిర్వహించేందుకు కరోనా అవకాశం కల్పించాలని కుటుంబ సభ్యులు ఆశిస్తున్నారు.


Recent Random Post: