టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ”రౌడీ బాయ్స్”. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేస్తున్నారు.
రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ‘రౌడీ బాయ్స్’ మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్ – టీజర్ – సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా అలరించాయి ఈ నేపథ్యంలో తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ ను ఆవిష్కరించారు. ”ట్రైలర్ చాలా ప్రామిసింగ్ గా ఉంది. అరంగేట్రం చేస్తున్న ఆశిష్ కి నా శుభాకాంక్షలు. అలాగే రాజు గారు – శిరీష్ గారు – శ్రీ హర్ష – అనుపమ మరియు టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు” అని తారక్ ట్వీట్ చేశారు.
ఇక ట్రైలర్ విషయానికొస్తే.. కాలేజీ అంటే మంచి మంచి పోరీలు.. మస్తు మస్తు పార్టీలు – క్రేజీ ఈవెంట్స్ అని చెప్పడంతో ప్రారంభమవుతుంది. ఇది కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే యూత్ పుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. తండ్రితో తిట్లు తినే బాధ్యతలేని కుర్రాడిగా హీరో ఆశిష్ ను చూపించారు. ఇంజినీరింగ్ స్టూడెంట్ అయిన హీరో.. మెడికల్ కాలేజీకి చెందిన హీరోయిన్ అనుపమని ప్రేమించడం వల్ల జరిగిన గ్యాంగ్ వార్స్ ను ఇందులో ప్రధానంగా చూపించారు.
నిర్మాత లగడపాటి శిరీష్ తనయుడు సహిదేవ్ విక్రమ్ – కార్తీక్ రత్నం – శ్రీకాంత్ అయ్యంగార్ – తేజ్ కూరపాటి – కోమలీ ప్రసాద్ తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. తొలి సినిమా అయినప్పటికీ ఆశిష్ ఎనర్జిటిక్ స్క్రీన్ అప్పీరియన్స్ తో ఆకట్టుకున్నాడు. అనుపమ క్యూట్ గా కనిపించడమే కాదు.. రొమాంటిక్ సీన్స్ చేసి ఆశ్చర్యపరిచింది. లవ్ అండ్ యాక్షన్ కలబోసిన ‘రౌడీ బాయ్స్’ ట్రైలర్ అలరిస్తోంది. ‘ప్రేమదేశం’ తరహా సినిమాని చూడబోతున్నట్లు హింట్ ఇస్తోంది.
రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. మధే సినిమాటోగ్రఫీ అందించగా.. రాజీవన్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేశారు. రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్ గా.. మధు ఎడిటర్ గా వర్క్ చేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు – శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. హర్షిత్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరించారు. దిల్ రాజు ఫ్యామిలీ నుంచి హీరోగా రాబోతున్న ఆశిష్ కు ”రౌడీ బాయ్స్” సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
Recent Random Post: