పవన్ కళ్యాణ్ వరుసగా నాలుగు సినిమాలకు కమిట్ అయ్యాడు. అందులో మొదటగా వకీల్ సాబ్ రాబోతుంది. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో సినిమా పట్టాలెక్కబోతుంది. క్రిష్ సినిమా చేస్తూనే మరో వైపు హరీష్ శంకర్ సినిమాను కూడా పవన్ చేయబోతున్నాడు. ఈ మూడు సినిమాలు కాకుండా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమాను పవన్ కళ్యాణ్ చేయబోతున్నాడు. వీరిద్దరి కాంబోలో సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్రారంభం కాబోతుంది. ఆ లోపు అఖిల్ తో సూరి ఒక సినిమాను ముగించబోతున్నాడు.
పవన్ కళ్యాణ్ తో మూవీ కోసం సురేందర్ రెడ్డి ఒక పొలిటికల్ డ్రామాను రెడీ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సోషల్ మెసేజ్ తో పాటు ఒక బలమైన పొలిటికల్ కథను దర్శకుడు సురేందర్ రెడ్డి కమర్షియల్ ఎలిమెంట్స్ తో కలిపి చూపించేందుకు రెడీ అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న పవన్ ఇలాంటి కథలు చేయడం వల్ల రాజకీయంగా మరింత బలం పుంజుకునే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Recent Random Post: