పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మల్టీపుల్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. వకీల్ సాబ్ తో విజయాన్ని అందుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోశియుమ్ చిత్ర రీమేక్ పై దృష్టి పెట్టాడు. ఈ సినిమాలో రానాతో కలిసి నటిస్తున్నాడు. దీంతో పాటు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీర మల్లు సినిమా కూడా సెట్స్ పై ఉంది.
ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక హరీష్ శంకర్ దర్శకత్వంలో కంప్లీట్ ఎంటర్టైనర్ లో నటించనున్నాడు పవన్ కళ్యాణ్, సెప్టెంబర్ 2న తన పుట్టినరోజును జరుపుకోనున్న విషయం తెల్సిందే. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ను హరీష్ శంకర్ ఇటీవలే అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ సెట్స్ ను సందర్శించాడు.
పవన్ ను కలిసిన హరీష్ పుట్టినరోజుకు స్పెషల్ పోస్టర్ ను విడుదల చేస్తున్నట్లు తెలిపాడు. హరీష్ ఐడియాకు పవన్ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. మరి అది ఏ విధమైన లుక్ అన్నది తెలియాల్సి ఉంది.
Recent Random Post: