కొత్త బాధ్యతలను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్

అల వైకుంఠపురములో చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ కొంత బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రాన్ని దసరా తర్వాత మొదలుపెట్టనున్న త్రివిక్రమ్ ప్రస్తుతం భీమ్లా నాయక్ ప్రొడక్షన్ లో చురుగ్గా పాల్గొంటున్నాడు.

ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తూనే నిర్మాణంలో కూడా పాలుపంచుకుంటున్నాడు. తాజా సమాచారం ప్రకారం త్రివిక్రమ్ ఈ రోల్ ను కంటిన్యూ చేస్తాడట. పవన్ కళ్యాణ్ చిత్రాలకు సంబంధించి నిర్మాణ వ్యవహారాల్లో ఈ స్టార్ దర్శకుడు ప్రమేయం ఉంటుందిట. అలాగే పవన్ తో కలిసి సినిమాలను నిర్మించే ఆలోచనను కూడా చేస్తున్నాడట.

ఇప్పటికే కొంత మంది దర్శకులతో త్రివిక్రమ్ శ్రీనివాస్ టచ్ లో ఉన్నాడని, ప్రస్తుతం పవన్ సినిమాలు పూర్తయ్యాక నెక్స్ట్ సెట్ చిత్రాలను ప్రకటిస్తారని తెలుస్తోంది.


Recent Random Post: