అధికార పార్టీ నేతల అడ్డగోలు వ్యాఖ్యలు.. బూతుల సంగతి పక్కన జెడితే, జనసైనికులు తమ పని తాము చేసుకుపోతున్నారు. ‘ప్రభుత్వం చెయ్యాల్సిన పనిని జనసైనికులు చేస్తున్నారు..’ అనే చర్చ ప్రజల్లో బలంగా జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ అంతటా.. పాడైపోయిన దాదాపు అన్ని రోడ్లపైనా జనసేన శ్రేణులు గత కొద్ది రోజులుగా శ్రమదానం చేస్తున్నాయి.
నిజానికి, ప్రభుత్వం చెయ్యాల్సిన పని ఇది. రోడ్లకు చిన్న చిన్న గుంతలు ఏర్పడినప్పుడు తాత్కాలిక మరమ్మత్తులు వెంటనే చేస్తే, పెద్ద పెద్ద గుంతలు ఏర్పడే పరిస్థితి రాదు. కానీ, ప్రభుత్వం రోడ్లను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. వేల కోట్లతో టెండర్లు పిలుస్తాం.. పిలుస్తున్నాం.. పిలిచేశాం.. అంటూ రెండున్నరేళ్ళుగా వైఎస్ జగన్ సర్కార్ కాలయాపన చేసింది రోడ్ల విషయమై.
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా, రాష్ట్రంలో చాలా రోడ్లు పూర్తిగా రూపాన్ని కోల్పోయాయి. ఈ క్రమంలో జనసేన గత కొద్ది నెలలుగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూనే వుంది పాడైపోయిన రోడ్ల విషయమై. గత నెలలో కాస్త గట్టిగా ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చిన జనసేన, తాజాగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసింది.. స్వయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు.. శ్రమదానం చేశారు. ఆయన బాటలో, జనసైనికులు ఎక్కడికక్కడ సొంత ఖర్చుతో రోడ్ల మరమ్మత్తులు చేస్తున్నారు.
రోడ్లపై జనసైనికులు పడుతున్న కష్టానికి ఆ రోడ్ల మీద ప్రయాణించేవారి కృతజ్ఞతలు దక్కుతున్నాయి. జనసేనకు అనూహ్యంగా ప్రజల నుంచి పెరుగుతున్న మద్దతుతో అధికార పార్టీ వెన్నులో వణుకు మొదలైంది. ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి, రోడ్లను బాగు చేయించలేని అధికార పార్టీ నేతలు, జనసేన అధినేత మీద బూతులతో విరుచుకుపడుతున్నారు.
మరోపక్క, జనసైనికులపై దాడులూ పెరిగిపోతున్నాయి. ‘రోడ్లను బాగు చెయ్యడానికి వీల్లేదు.. చట్టాలు అందుకు ఒప్పుకోవు.. ప్రైవేటు వ్యక్తులు రోడ్లపై ఎలాంటి రిపేర్లూ చెయ్యకూడదు.. ప్రభుత్వమే ఆ పని చెయ్యాలి..’ అంటూ అధికారుల నుంచి సైతం, జనసైనికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
రోడ్డు ప్రమాదకరంగా మారితే, ఆ ప్రమాదాల్ని నివారించేందుకు రోడ్లకు చిన్న చిన్న మరమ్మత్తులు చేయడం నేరమట. అంటే, ఆ గుంతల కారణంగా ప్రజల ప్రాణాలు పోయినా ఫర్లేదా.?
Recent Random Post: