పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25న విడుదల షెడ్యూల్ అయిన విషయం తెల్సిందే. ఈ సడెన్ అనౌన్స్మెంట్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. భీమ్లా నాయక్ కు మార్కెట్ లో ఫుల్ క్రేజ్ ఉంది. ఈ చిత్రానికి ఓపెనింగ్స్ అదిరిపోతాయన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇక భీమ్లా నాయక్ క్రేజ్ కు తాజా నిదర్శనంగా ఈ చిత్ర డిజిటల్ అండ్ సాటిలైట్ రైట్స్ రికార్డ్ ధరకు అమ్ముడుపోయాయి. డిస్నీ + హాట్ స్టార్, స్టార్ మా సంస్థలు ఈ చిత్ర రైట్స్ దక్కించుకున్నాయి. అంతే కాకుండా హిందీ డబ్బింగ్ రైట్స్ కు కూడా క్రేజీ ఆఫర్ వచ్చింది. ఈ నాన్ థియేట్రికల్ రైట్స్ అన్నీ కలుపుకుని 70 కోట్ల రూపాయలు పలికినట్లు సమాచారం.
సితార ఎంటర్టైన్మెంట్స్ కు ఈ చిత్రం ద్వారా దాదాపు 30 కోట్ల రూపాయల లాభం వచ్చినట్లు సమాచారం.
Recent Random Post: