పవన్ – క్రిష్ మూవీకు ఆసక్తికర టైటిల్ ఫిక్స్!

Share

2021లో ఫుల్ బిజీగా ఉండే నటుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ ఏప్రిల్ 9న విడుదలవుతోంది. అలాగే ప్రస్తుతం పవన్ నటిస్తోన్న రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ ఒకటి కాగా, క్రిష్ దర్శకత్వంలో చేస్తోన్న జానపద ఆధారిత చిత్రం మరొకటి.

క్రిష్ – పవన్ మూవీని ఏఎం రత్నం నిర్మిస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ పై రకరకాల రూమర్స్ షికార్లు చేసాయి కానీ తాజా సమాచారం ప్రకారం నిర్మాతలు హరహర వీరమల్లు అనే టైటిల్ ను రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వజ్రాల దొంగతనం చేసే వీరమల్లు పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది.

నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే జాక్వలిన్ ఫెర్నాండేజ్ మరో కీలక పాత్రను పోషిస్తోంది. ఎం ఎం కీరవాణి సంగీత దర్శకుడు.


Recent Random Post: