మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో మన ముందుకు రాబోతున్నాడు. వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన చిత్రం కరోనా కారణంగా వాయిదాలు పడుతూ వచ్చి చివరికి ఫిబ్రవరి 12న విడుదలైంది. ఈ సినిమా విడుదల సందర్భంగా నాగబాబు వైష్ణవ్ తేజ్ గురించి కొన్ని విషయాలు రివీల్ చేసాడు.
“వైష్ణవ్ తేజ్ కు లైఫ్ లో ఏది సాధించాలి అన్న విషయంలో చాలా కన్ఫ్యూజన్ ఉండేది. అయితే ఎప్పుడు ఈ ఆలోచన వచ్చిందో తెలీదు కానీ నటుడిగా మారాడు. వైష్ణవ్ కు పవన్ కళ్యాణ్ థాయ్ బాక్సింగ్ నేర్చుకోమని సలహా ఇచ్చాడు. ఆ మాటకు కట్టుబడి 8-9 నెలలు థాయ్ బాక్సింగ్ నేర్చుకున్నాడు. ఆ వీడియో నేను చూసాను. స్టన్ అయ్యాను. వైష్ణవ్ ఎప్పుడూ ఎవరినీ సెట్స్ కు రానిచ్చేవాడు కాదు. మెగా ఫ్యామిలీలో అందరికీ కుటుంబ సభ్యుల ముందు నటించాలంటే సిగ్గుగా ఉంటుంది. అయితే రామ్ చరణ్ ఈ సినిమా చూసి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చాడు” అని నాగబాబు రివీల్ చేసాడు.
Recent Random Post: